మిరపకాయ బజ్జీలు అంటే అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి బజ్జీ మిరపకాయలతో స్పెషల్ కర్రీ చేస్తే.. పలావుల్లోకి, ఫ్రైడ్ రైసుల్లోకి సూపర్ కాంబినేషన్. ఇది చేసుకోవడం సింపుల్..టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి మర్చికా సాలన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!
మిర్చి కా సాలన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు..
బజ్జిమిపకాయలు 6
టమోటా పేస్ట్ ఒక కప్పు
ఉల్లిపాయ స్లైసెస్ అరకప్పు
వేరుశనగప్పులు రెండు టేబుల్ స్పూన్స్
నువ్వులు రెండుటేబుల్ స్పూన్స్
కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్స్
గసగసాలు ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక. టీ స్పూన్
దాల్చినచెక్క ఒక ముక్క
లవంగాలు మూడ
యాలుకలు రెండు
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
కరివేపాకు కొద్దిగా
తయారు చేసే విధానం..
ఒక మిరపకాయను రెండు ముక్కలుగా కట్ చేసుకుని పైన కూడా కట్ చేయండి.పూర్తిగా కాదు. బజ్జీలకు చేసినట్లు. పొయ్యిమీద బాండీ పెట్టి వేరుశనగపప్పులను దోరగా వేయించుకోండి. ఇవి వేడెక్కిన తర్వాత నువ్వులు, గసగసాలు వేయండి. కొబ్బరి కూడా వేయండి. ఇవి అన్నీ దోరగా వేపించి చల్లారక మిక్సీలో వేసుకుని ఫస్ట్ లైట్‌గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు అందులో పెరుగు వేసి పేస్ట్‌లా చేయండి.
పొయ్యిమీద ఒక నాన్‌స్టిక్ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి జీలకర్ర, కరివేపాకు, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క చిన్న ముక్క వేసి తాలింపులో వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఆ తర్వాత పసుపు, మిరపకాయలు వేసి రెండు నిమిషాలు వేడెక్కిన తర్వాత టమోటా పేస్ట్ వేయండి. మూతపెట్టి కాసేపు ఉడకనివ్వండి. టమోటాలో పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గ్రేవీ వేసి, నిమ్మరసం వేయండి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడనివ్వండి. అంతే ముక్కలకు గ్రేవీ పట్టి కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో డ్రస్సింగ్ చేసి దింపేయండి. అంతే!