నోరూరించే చికెన్ టిక్కా ఎలా వండాలో మీకు తెలుసా?

చికెన్ టిక్కా.. చికెన్ వంటకంలో అదో వెరయిటీ. మెత్తని చిక్కెన్ ముక్కలతో చేసే వంటకమే చికెన్ టిక్కా. కాకపోతే దీన్ని కూరలా వండరు. డిఫరెంట్ గా వండుతారు. ఒక్కో చికెన్ టిక్కాను నోట్లే వేసుకుంటే ఉంటది నా సామిరంగా. చాలామంది చికెన్ టిక్కాను రోటీల్లోకి, మందులోకి స్టఫ్ గానూ తీసుకుంటారు. మరి.. ఈ చికెన్ టిక్కా ఎలా వండాలో తెలుసుకుందామా…

ఓ హాఫ్ కేజీ చికెన్ ముక్కలు బొక్కలు లేకుండా, కొంచెం శనగపిండి, కప్పు పెరుగు, కారం, మిరియాలపొడి, పసుపు, ఉప్పు, ధనియాలపొడి, గరంమసాలా, బిర్యానీ మసాలా, నిమ్మరసం, కసూరీమేతీ ఉంటే చాలు చికెన్ టిక్కాను ఏం చక్కా వండేయొచ్చు. హా.. ఈ కసూరీ మేతీ ఏంది అని నెత్తి గోక్కోకండి. మెంతి కూర తెలుసు కదా. దాన్ని చిన్నగా తరిమి ఎండబెడితే అదే కసూరీ మేతీ. చికెన్ టిక్కాకు అసలైన టేస్ట్ ను అందించేది ఈ కసూరీ మేతీనే.

ఇక చికెన్ టిక్కా వండే విధానం తెలుసుకుందామా… ముందుగా ఓ గిన్నెను తీసుకొని దాంట్లో పైన మనం చెప్పుకున్న అన్నింటినీ వేసి బాగా కలపండి. బాగా అంటే బాగా అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. అయిందా.. ఓ అరగంట పాటు ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టండి. ఆ తర్వాత దాన్ని బయటికి తీయండి. ఓ ఇనుప చువ్వ తీసుకోండి. చికెన్ ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చండి. తర్వాత నిప్పుల మీద వాటిని కాల్చండి. అంతే.. వేడి వేడి చికెన్ టిక్కా రెడీ. అవి మంట మీద బాగా కాలాకా ఏం చక్కా చువ్వ నుంచి బయటికి తీసి లాగించేయడమే.