కార్న్ సూప్ ను ఇలా చేస్తే మస్త్ టేస్ట్..

-

వర్షం చినుకులు చల్లగా పడుతుంటే వేడి వేడిగా ఏదైనా చేసుకొని తినాలని అనుకుంటారు..పకోడీ కామన్ అయిపోయింది. ఇంకాస్త కొత్తగా చేయాలని అనుకోనేవాల్లు సూప్ లను తయారు చేసుకోవచ్చు.. చాలా సింపుల్ గా వేడి వేడిగా కావాలి అనుకునేవాల్లు కార్న్ సూప్ ను ట్రై చెయొచ్చు.. రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది.. ఇక ఆలస్యం లేకుండా చిటికెలో ఈ సూప్ ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం..

కావలసిన పదార్థాలు:

మొక్కజొన్న గింజలు – ఒక కప్పు
నీళ్లు – రెండు కప్పులు
మిరియాల పొడి – పావు టీస్పూను
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను
అల్లం తరుగు – ఒ టీస్పూను
నెయ్యి – ఒక టీస్పూను
ఉప్పు – రుచికి తగినంత

తయారీ విధానం:

ముందుగా మొక్క జొన్నలను తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా మిక్సిలో వేసి పేస్ట్ చేయాలి.రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టి చిన్న మంట మీద నెయ్యి వేసి వేడిచేయాలి. వేడెక్కిన నెయ్యిలో జీలకర్ర వేయాలి. అందులోనే అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి. మొక్కజొన్న ముద్ద మిశ్రమం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిరియాల పొడి కూడా చల్లాలి. ఇప్పుడు చిన్న మంట మీద పావుగంట సేపు ఉడకనివ్వాలి.. మంచి కార్న్ వాసన వచ్చినపుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తాగడం మంచిది..మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..ఒకసారి టేస్ట్ నచ్చితే ఇక వదలరు..

Read more RELATED
Recommended to you

Exit mobile version