పొటాటో జ్యూస్‌ తాగడం వల్ల మెగ్రెయిన్‌, కొలెస్ట్రాల్‌, అల్సర్‌..అన్నీ సెట్..!!

-

బంగాళదుంపను ఎంత తక్కువ తింటే అంత మంచిదని పోషకాహార నిపుణులు చెప్తూ ఉంటారు.. ఆకుకూరలు ఎక్కువగా తినాలి.. ఆ తర్వాత దుంపలు తినాలి అంటారు.. మనం మాత్రం రివర్స్‌ చేస్తుంటాం.. బంగాళదుంపలతో ఫ్రేలు, కర్రీలు చేసుకుంటాం.. చాలామందికి ఫేవరెట్‌ ఆలూనే ఉంటుంది. త్వరగా అయిపోయే కూర కూడా అది.. అయితే.. బంగాళదుంపను కూరగా చేసుకుని తినడం కంటే.. జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయట.. ఎన్నో అనారోగ్య సమస్యలకు పొటాటో జ్యూస్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.. అవేంటంటే..

కొలెస్ట్రాల్ నియంత్రణ

బంగాళదుంప జ్యూస్ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో దోహదపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు పొటాటో జ్యూస్ బాగా హెల్ప్‌ అవుతుంది.

మైగ్రెయిన్ అరికట్టేందుకు

పొటాటో జ్యూస్ మానసిక ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఇది ఒత్తిడి, అలసట, డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. ఈ జ్యూస్ మైగ్రెయిన్ పెయిన్ అరికట్టేందుకు బాగా హెల్ప్‌ అవుతుంది. పొటాటో జ్యూస్ తాగడమే కాకుండా తలకు రాసుకున్నా మంచి ఫలితాలుంటాయి. నొప్పి క్రమంగా తగ్గుతుంది.

అల్సర్ ముప్పు

పొటాటోలో ఉన్న న్యూట్రియంట్లు అల్సర్‌ను దూరం చేయడంలో కీలకంగా ఉపయోగపడతాయి. బంగాళదుంప జ్యూస్ తాగడం వల్ల కడుపులో బ్యాక్టీరియా అంతమవుతుంది. అల్సర్ ఏర్పడకుండా నియంత్రిస్తుంది..

ఇమ్యూనిటీ పవర్..

పొటాటో జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. వ్యాధుల్నించి పోరాడే సామర్ధ్యం కలుగుతుంది. పొటాటోలో ఉన్న విటమిన్ సి అంటువ్యాధుల్నించి రక్షిస్తుంది.

హెల్తీ లివర్

పొటాటో జ్యూస్ లివర్‌ను డీటాక్స్ చేయడంలో చాలా బాగా హెల్ప్‌ అవుతుంది. ఉదయం పరగడుపున పొటాటో జ్యూస్ తాగడం వల్ల లివర్ శుభ్రమవుతుంది. హెపటైటిస్ వంటి వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. పొటాటో జ్యూస్ మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొటాటో జ్యూస్‌లో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి..పైన సమస్యలు ఉన్నవాళ్లు ఒకసారి ట్రై చేయండి.! అయితే ఏదైనా ట్యాబ్లెట్స్‌ వాడేవాళ్లు మాత్రం వైద్యుల సలహా మేరకే వాడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news