రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మీ డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహారాలు..

ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ కూడా ఒకటి. అందువల్ల దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారుతున్న జీవన విధానాలు, ఆహార అలవాట్లు, సరైన పోషకాలు అందకపోవడం మొదలగునవి ఇలాంటి క్యాన్సర్లకి కారణాలుగా నిలుస్తున్నాయి. మరి వీటి బారిన పడకుండా ఉండేందుకు మీ డైట్ లో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలో తెలుసుకుందాం.

బ్రోకలీ

ఇందులో అత్యంత విశిష్టమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. సల్ఫోరాఫేన్ అనేది రొమ్ము క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుంది. అందువల్ల బ్రోకలీని మీ జీవితంలో భాగం చేసుకోండి.

వాల్ నట్స్

గింజల్లో ఎక్కువ పోషకాలు ఉన్నవాటిల్లో వాల్ నట్స్ మొదటి స్థానంలో ఉంటాయి. ఇది రొమ్ము క్యాన్సర్ కణాలని పూర్తిగా చంపేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలు బయట నుండి వచ్చే విషాన్ని శరీరంపై ప్రభావం చూపకుండా చూస్తుంది.

సాల్మన్

సాల్మన్ చేపలో ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది రొమ్ము క్యాన్సర్ ని నివారించడంలో సాయపడుతుంది.

కాఫీ

కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ ని రానివ్వకుండా నివారిస్తాయి. అందువల్ల రోజూ ఉదయం ఒక గ్లాసు కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బీన్స్

మీ ఆహారంలో ఫైబర్ ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ ధర్మాలు శరీరంలో విష పదార్థాలని బయటకి పంపివేస్తాయి. అందుకే బీన్స్ ని మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.

కొత్తిమీర

కొత్తిమీర ని చులకనగా చూస్తే పొరపాటే. ఇది శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కణాలకు నిరోధంగా ఉంటుంది. అందుకే కొత్తిమీర ఉంచుకోండి.