కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా..? అయితే ఈ ఆకులతో సమస్యని దూరం చెయ్యండి..!

జామ పండ్లే కాదు జామ ఆకులు కూడా మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు అటువంటి వాళ్ళకి జామ ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకుల వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ ఆకులు ని ఉపయోగించి ఎటువంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనే ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులని మాయం చేయడానికి జామ ఆకులు మనకి సహాయపడతాయి. అయితే జామ ఆకుల ద్వారా కీళ్లనొప్పులు సమస్యకి ఎలా పెట్టొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

దీని కోసం ముందుగా మీరు జామ ఆకులని వేడి చేసి ఒక గుడ్డలో కట్టి నొప్పి ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో కట్టండి. ఇలా రాత్రంతా ఉంచితే ఉపశమనం లభిస్తుంది. తర్వాత రోజు గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని కడుక్కోండి ఇలా మీరు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
జామ ఆకులను తీసుకుని ముక్కలు కింద తరుక్కోండి. ఒక గ్లాసు నీళ్లు వేసి వీటిని మరిగించండి ఉదయాన్నే మీరు ఈ రసాన్ని కనుక తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా జామ ఆకులు బాగా ఉపయోగపడతాయి.
బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి కూడా.
జామ ఆకుల రసాన్ని ప్రతిరోజు తాగితే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి కేవలం జామ పండ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనుకుంటే పొరపాటు ఈ ఆకుల వలన కూడా సమస్యల నుండి బయటపడవచ్చు.