Keeradosa and tomato: ఆరోగ్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి నచ్చిన ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా తీసుకోకూడదు. ఆహారం తీసుకునే దానికి కూడా ఓ పద్ధతి ఉంది. ఆహారాన్ని తీసుకునేటప్పుడు అస్సలు తప్పులు చేయకూడదు. చాలా మంది ఈ పోషకాహారం అందాలని ఇష్టం వచ్చినట్లుగా కూరగాయలను తీసుకుంటూ ఉంటారు సలాడ్ రూపం లో చాలా రకాల కాంబినేషన్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం కీరదోస టమాటా కలిపి తీసుకోకూడదు.
ఎప్పుడైనా సరే కూరగాయలతో సలాడ్ చేసుకోవాలని అనుకుంటే మొట్టమొదట చాలామంది కీరదోస టమాటా ని సలాడ్ చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు కలిపి తీసుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, అజీర్తి, వికారం, వాంతులు, నీరసం వంటివి ఈ రెండు కలిపి తీసుకోవడం వలన కలుగుతాయి.
అలానే కీర దోస టమాటా కలిపి తీసుకోవడం వలన ఆస్తమా కూడా కలుగుతుంది ఈ రెండిటిని అసలు కలిపి తీసుకోకూడదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రెండిటినీ కలిపి తీసుకోకండి. అలానే ముల్లంగి కీరదోస కలిపి కూడా తీసుకోకూడదు. ఈ రెండు కలిపి తీసుకుంటే కూడా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ తప్పులను చేయకుండా చూసుకోండి ఈ రెండిటిని కలిపి తీసుకుంటే పలు రకాలు ఇబ్బందులు కలుగుతాయి.