మంగళవారం మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు మంత్రి కేటీఆర్. రైతులు అధైర్యపడవద్దని.. అకాల వర్షాలు ఎందుకు కురుస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ధైర్యంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉంచాలని.. దెబ్బతిన్న ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి పదివేల రూపాయల పరిహారాన్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటలను అధికారులు గుర్తిస్తున్నారని తెలిపారు.