బాడీ లోషన్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

-

శరీరంలో అతిపెద్ద అవయవం అయిన చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. చర్మ సమస్యల నుండి కాపాడుకుంటూ ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవడం ముఖ్యం. ఐతే చర్మ సమస్యలు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. దీనికోసం మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చర్మానికి ఎండ సోకి నల్లగా మారకుండా సన్ స్క్రీన్ లోషన్ వాడుతుంటాం. ఇంకా చర్మాన్ని తేమగా ఉంచడానికి, చర్మంపై మచ్చలు పోవడానికి లోషన్స్ వాడుతుంటాం. ఈ లోషన్స్ ధర ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. కొన్ని సార్లు అధిక ధరలు వీటిని కొనకుండా చేస్తాయి. ఐతే అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో బాడీ లొషన్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా..

ఇంట్లో ఉన్న వస్తువులతో బాడీ లోషన్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

దీనికోసం కావాల్సిన పదార్థాలు..

గ్లిసరిన్.. 5 టీ స్పూన్లు..
రోజ్ వాటర్… 7 టీ స్పూన్లు..
నిమ్మరసం… సగం నిమ్మకాయ రసం సరిపోతుంది..

ముందుగా రోజ్ వాటర్ లో గ్లిసరిన్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సగం కోసుకున్న నిమ్మకాయ నుండి రసాన్ని తీసుకోవాలి. ఈ మూడింటినీ బాగా కలపాలి. మూడు వస్తువులు బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుతూ ఉండాలి. అంతే మీ లోషన్ రెడీ ఐపోయింది..

ఇప్పుడు దాన్ని తీసుకుని ఒక బాటిల్ లో భద్రపర్చుకోండి. ఈ లోషన్ 4 రోజుల దాకా పనిచేస్తుంది.

ఐతే బాడీ లోషన్ తయారు చేసుకున్నాం సరే.. దాన్ని ఎప్పుడు వాడాలనేది కూడా ముఖ్యమే. సాధారణంగా స్నానం చేసిరాగానే బాడీ లోషన్ అప్లై చేసుకోవడం సరైన పద్దతి. ఇంట్లో తయారు చేసుకున్న బాడీ లోషన్, చర్మాన్ని తేమగా ఉంచడానికి బాగా సహకరిస్తుంది. అందులో రోజు వాటర్, గ్లిసరిన్ దీనికి బాగా ఉపయోగపడతాయి.

ఇంకా చర్మంపై మచ్చలు ఏర్పడకుండా కాపాడుతుంది. చర్మంపై సాగడం వల్ల ఏర్పడే మచ్చలని తొలగించడంలో ఈ బాడీ లోషన్ చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఐతే ఈ బాడీ లోషన్ ని డైరెక్టుగా అప్లై చేసుకోవద్దు. ముందుగా మీ బాడీపై ఎలాంటి ఎలర్జీ తీసుకురావట్లేదని తెలుసుకున్న తర్వాతే యూజ్ చేయండి. అందుకని టెస్ట్ చేయడం మర్చిపోవద్దు.

ఇప్పుడు ఈ లోషన్ ని మీ బాడీకి అప్లై చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందుగా మీ బాడీ మీద ఎలాంటి ఎలర్జీ తీసుకురాదని కన్ఫర్మ్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news