నిద్రపట్టడం లేదా? అయితే టీ తాగండి!

-

వృద్దులు పసిపిల్లతో సమానం అని ఎందుకు అన్నారో దీన్ని చదివితే అర్థమవుతుంది. ఎలా అంటారా.. పసిపిల్లలు అందరికంటే ముందే నిద్రలేచి అందరినీ నిద్రలేపుతారు. అందరికంటే ముందే నిద్రపోతారు. వృద్ధులు కూడా అంతే.. తిన్నమా, పడుకున్నామా, లేచామా అన్నట్లుంటారు. అందరికంటే ముందులేచి ఇంకా నిద్రలేవలేదు అని ఇంట్లో వాళ్లను అరుస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు పోల్చుతారో. పసిపిల్లలు రోజులో రెండు, మూడుసార్లు నిద్రపోతారు కాబట్టి ఉదయాన్నే నిద్రలేస్తారు. ఇక వృద్ధులు విషయానికి వస్తే వారికి వయసు మీద పడడంతో నిద్ర సరిగా పట్టదు. వీరు ఖాళీగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మధ్యాహ్న వేళ కాస్త కునుకుతీస్తారు కాబట్టి వీరికి కూడా నిద్రసరిగా పట్టదు. మరి బిజీ లైఫ్‌లో జీవిస్తున్న నేటితరం మాత్రం పగలు ఒకసారి కూడా నిద్రపోరు. అలాంటప్పుడు రాత్రివేళ నిద్రపట్టడంలేదని సతమతమవుతున్నారు. అలాంటి వారికి రాత్రులు పడుకోగానే నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలున్నాయి. అదేంటంటే.. టీ తాగాలి.

ఎలాంటి టీ సేవించాలి? దాని తయారీ!

టీ తయారు చేసుకోవడానికి ప్రత్యేక దినుసులు ఏమి అవసరం లేదు. కేవలం అరటి పండు, కాస్త నీళ్లు, దాల్చిన చెక్కు ఉంటే సరిపోతుంది.

– ఒక అరటిపండు తీసుకొని దానిని ముందుగా శుభ్రపరుచుకోవాలి. దాని కొనలను ఇరువైపులా అంటే పైన కోన, కింద కొన కత్తిరించాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దానిలో ఒక గ్లాస్‌ నీళ్లు పోసి ముందుగా కత్తిరించి పెట్టుకున్న అరటిపండును అందులో వేసి ఒక పదినిమిషాల పాటు బాగా మరగపెట్టాలి.

– బాగా మరిగించిన తర్వాత ఆ పాత్రను తీసుకొని దానిని వడకట్టి ఆ నీరును వేరు చేయాలి. అరటిపండు మామూలుగానే తీయగా ఉంటుంది. కనుక మనం ప్రత్యేకంగా చక్కెర, బెల్లంలాంటి వాటిని కలుపుకోవాల్సిన అవసరం లేదు.
– ఈ మిశ్రమం ఉడికేటప్పుడు దాల్చిన చెక్క కూడా కావాలంటే వేసుకోవచ్చు. లేకున్నా దాని పొడి అయినా మరిగించిన నీటిలో కలుపుకోవచ్చు. అరటిపండులో సహజంగానే మూలకాలు ఉండడం వల్ల అవి మీకు శక్తితోపాటు అందులో అమైనో ఆమ్లాల వల్ల చక్కటినిద్ర కూడా పడుతుంది.

– ఈ మిశ్రమం ఉండికేటప్పుడే దాల్చిన చెక్క కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేకున్నా దానిపొడినైనా మరిగించిన నీటిలో కలుపుకోవచ్చు అది మీ ఇష్టం. అరటిపండులో సహజంగానే ఎన్నో మూలకాలు ఉండడం వల్ల అవి మీకు శక్తితోపాటు అందులో ఉండే అమైనో ఆమ్లాల వల్ల మీకు చక్కటి నిద్ర కూడా పడుతుంది.

– ఈ చిన్న చిట్కా వాడడం వల్ల మీరు నిద్రలేమి సమస్య నుంచి దూరం కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. హాయిగా నిద్రపోండి.

Read more RELATED
Recommended to you

Latest news