డయాబెటిస్ వున్నవాళ్లు ఖర్జూరం తినచ్చా..?

-

ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఖర్జూరాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఎన్నో రకాల సమస్యలను ఖర్జూరం దూరం చేస్తుంది. అందుకనే ప్రతి రోజు చాలా మంది ఖర్జూరాన్ని తింటూ ఉంటారు.

ఖర్జూరం వలన కలిగే లాభాలు:

ఖర్జూరంలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ మొదలైనవి ఉంటాయి. వివిధ రకాల సమస్యలను ఇది దూరం చేస్తుంది.

బీపీ కంట్రోల్ లో ఉంటుంది:

ఖర్జూరం తీసుకోవడం వలన బిపి కంట్రోల్ లో ఉంటుంది ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది అలానే ఇతర మినరల్స్ కూడా ఉంటాయి.

కార్డియో వాస్కులర్ సమస్యలు ఉండవు:

ఖర్జూరాన్ని తీసుకోవడం వలన కార్డియో వాస్కులర్ సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు కర్జూరాన్ని తీసుకుంటే మంచిది.

పొటాషియం:

పొటాషియం లెవెల్స్ తక్కువ ఉండడం వలన ఇన్సులిన్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకుంటే ఈ సమస్య ఉండదు.

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఖర్జూరం తీసుకోవచ్చా..?

ఖర్జూరం బాగా తియ్యగా ఉండడం వలన డయాబెటిస్ ఉన్నవాళ్లు ఖర్జూరం తీసుకోకూడదు ఏమో అని అనుకుంటూ ఉంటారు అయితే తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎక్కువ ఖర్జూరాన్ని తీసుకోవడం వలన ప్రమాదం ఉంటుంది. బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి ఎక్కువ తీసుకోకుండా ఉంటే చాలు.

ఖర్జూరాన్ని తీసుకోవడానికి మంచి సమయం ఏది..?

ప్రీ వర్కౌట్ స్నాక్స్ కింద ఖర్జూరాన్ని తీసుకుంటే మంచిది.
అలానే రాత్రి నిద్రపోయే ముందు తీసుకున్నా పర్వాలేదు.
మీరు తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news