జామ ఆకులతో జుట్టు సమస్యలకు చెక్.. ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు..!

-

ఈరోజుల్లో హెయిర్ లాస్ అనేది అందరిలో కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. చిన్నాపెద్దా, ఆడమగ అని తేడాలేకుండా అందరికి ఈ సమస్య ఉంటుంది. వీటికోసం చాలారకాల ఆయిల్స్, మరెన్నో రకాల షాంపులు వాడినా రిజల్ట్ పెద్దగా ఉండటం లేదు. హెయిర్ లాస్ అందరికి ఉన్నా..దానికి సంబంధించి కారణాలు అందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. ముందు అందరూ ఈ విషయం గ్రహించాలి. మనకు జుట్టు ఎందుకు రాలుతుంది అనే కారణాన్ని గుర్తించగలిగితే సమస్యకు పరిష్కారం వచ్చినట్లే. జుట్టు రాలకుండా ఉండాలంటే..మంచి పోషకాహారం తినాలి. కంటినిండా నిద్రపోవాలి. ఇంట్లో తయారు చేసుకునే రెమెడీతో జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. పెరటీ వైద్యం ఈ తరం వారికి తెలియదు కానీ..ఒకప్పుడు ఎన్నో సమస్యలకు వంటిల్లు, పెరట్లోనే పరిష్కారాలు ఉండేవి. ఇప్పుడు ఈ హెయిర్ లాస్ కు కూడా ఇంటిచిట్కాతో చెక్ పెట్టొచ్చు. అదేంటంటే..

జామా కాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలాగే జామా ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయండి.. జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ జామా ఆకులు ఎక్కువగా పనిచేస్తాయి..

ముందుగా 15 నుంచి 20 జామ ఆకులను కడిగి ఆరబెట్టండి.
ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించండి.
ఆ తర్వాత కాసేపు వేళ్లతో జుట్టును మర్దన చేయాలి.
అనంతరం జుట్టును గట్టిగా కట్టేయాలి.
అలా 30-40 నిమిషాలు వదిలేయాలి.
జుట్టు ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత షాంపూ ఉపయోగించాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.

జామ ఆకులతో స్ప్రే..

జామా ఆకులను కడిగి లీటరు నీటిలో వేసి మరిగించాలి. వాటిని 15-20 నిమిషాల వరకు ఉడకబెట్టిన తర్వాత చల్లార్చి వడగట్టి ఆ నీటిని సీసాలో జాగ్రత్త పరచాలి. మీ జుట్టును షాంపూతో శుభ్రం చేసి ఆరిన తర్వాత స్ప్రే బాటిల్ సహయంతో జుట్టు మూలాలపై జామా నీటిని అప్లై చేయాలి. అనంతరం 10 నిమిషాల పాటు మసాజ్ చేసి తర్వాత కొన్ని గంటలపాటు జుట్టును వదిలేయ్యాలి. ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి.

జామ ఆకు + ఉల్లి కాంబినేషన్..

జుట్టు సమస్యలకు ఉల్లికూడా బాగా పనిచేస్తుంది. జామ ఆకులను కడిగి బ్లెండర్ లో వేసి పేస్ట్ లా చేసుకోండి. ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేయండి.. ఇప్పుడు దానిని ఒక క్లాత్ లో వేసి ఉల్లి రసం తీసుకోవాలి. ఉల్లిపాయ రసంలో జామా ఆకుల పేస్ట్, కొబ్బరి నూనె కలపాలి. దీన్ని తలకు పట్టించి వేళ్లతో బాగా మాసాజ్ చేయాలి. అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.

ఇలా జామ ఆకులతో జుట్టుసమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే చేసిన మొదటిరోజే మీకు ఫలితాలు రావు..కనీసం రెండుమూడు సార్లు చేస్తే మీరు గమనిస్తారు. కొందరికి ఉల్లిపాయ పడదు. అలాంటి వారు ఉల్లిపాయ జామ ఆకు చిట్కాను ప్రయత్నించకండి.

Read more RELATED
Recommended to you

Latest news