యాంగ్జైటీ వల్ల పెరుగుతున్న ఛాతినొప్పి.. కరోనా కూడా కారణం కావొచ్చు..

-

కరోనా వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి మునపటిలా అస్సలు లేదు.. కాస్త దూరం నడవగానే ఆయాసం, చిన్న చిన్న పనులు చేసే అలిసిపోవటం కరోనా సోకిన వారిలో బాగా కనిపిస్తుంది. గుండె ఆరోగ్యం కూడా ఏమంత మెరుగ్గా లేదు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వారిలో అనేక సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రావడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. మానసిక ఆందోళన (యాంగ్జయిటీ), కోవిడ్ రెండింటి కారణంగా ఛాతిలో నొప్పి వస్తుంది. ఇవి రెండింటి మధ్య ఉన్న తేడాపై అవగాహన లేకపోవడం వల్ల అది ఏ రకమైన ఛాతీ నొప్పి అనేది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు.

కోవిడ్ ఛాతీ నొప్పి అయితే తెలుకోవడం ఎలా..?

కరోనా వైరస్ వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బంది, ఛాతిలో మంట, నొప్పి, బిగుతుగా అనిపించడం జరుగుతుంది. COVID-19 ఉన్నవారిలో 17.7 శాతం మంది వ్యక్తులు ఛాతీలో అసౌకర్యం, నొప్పిని అనుభవిస్తున్నారని ఓ పరిశోధన చెప్తుంది. అయితే ఈ అధ్యయనం ఓమిక్రాన్ రావడానికి ముందు జరిగింది. ఛాతీ నొప్పి అనేది కోవిడ్ తీవ్రమైన లక్షణంగా అధ్యయనం వెల్లడిస్తోంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమవడం, ఛాతిలో బిగుతుగా ఉండటం, ఊపిరితిత్తులకు తగినంత గాలి అందకపోవడం వల్ల ఛాతిలో నొప్పి వస్తుంది.

ఆందోళన వల్ల వచ్చే ఛాతీ నొప్పి సంకేతాలు ఇలా ఉంటాయి..

ఆందోళన అనేది ఒక వ్యక్తి కొన్ని పరిస్థితుల గురించి తీవ్రంగా ఆలోచించడం, తిండి నిద్ర కూడా మానేసి దాని ధ్యాసలోనే ఉండటం, భయపడటం వల్ల వస్తుంది. ఇందులో కండరాల బిగుతుగా అనిపించడం, గుండె దడ, వణుకు వంటి లక్షణాలు ఉంటాయి. కండరాలు బిర్రుగా మారడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆందోళనతో సంబంధం ఉన్న ఛాతీ నొప్పి తరచుగా ఛాతిని ఇబ్బంది పెడుతుంది.

రెండింటి మధ్య తేడా

కోవిడ్, ఆందోళన రెండూ ఛాతీ బిగుతుగా అయి, నొప్పికి దారితీస్తుంది. కానీ అవి పూర్తిగా భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఆందోళన మానసిక క్షోభ, భయం, గుండె దడ, హైపర్‌వెంటిలేషన్‌కు కారణమవుతుంది. కోవిడ్ జ్వరం, గొంతు నొప్పి, అలసట, ముక్కు కారటం, శరీర నొప్పులు వంటి ఫ్లూ-వంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఛాతీ నొప్పి 5 నుండి 20 నిమిషాల పాటు కొనసాగితే, అది చాలావరకు కోవిడ్ కంటే ఆందోళనగా ఉంటుంది. కోవిడ్ సంబంధ ఛాతీ నొప్పి సాధారణంగా నిరంతరంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి అనుభూతి కలుగుతుంది.

రెండింటిని సూచించే లక్షణాలు

అలసట, చలి, కడుపు నొప్పి, వికారం, చెమటలు పట్టడం, మూర్చలు రావడం వంటివి కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news