దగ్గు మొదలు ఎన్నో సమస్యలని తరిమేసే దాల్చిని…!

-

చలికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు చలికాలంలో వేధిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అవి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక అలాంటి సమస్యలు వస్తే ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. దగ్గు, జలుబు మొదలైన సమస్యలు తొలగించడానికి దాల్చిన బాగా పనిచేస్తుంది.

 

Cinnamon

ఒంటిని వేడిగా కూడా ఇది ఉంచుతుంది. ఆయుర్వేద గుణాలు ఉండే దాల్చినను తీసుకోవడం వల్ల చాలా సమస్యలు తగ్గించొచ్చు. అయితే మరి దాల్చిన తో ఎలాంటి సమస్యలు తొలగిపోతాయని ఇప్పుడు మనం చూద్దాం.

జలుబు మరియు ఫ్లూ:

దాల్చిన తో పాటు ఇతర స్పైసెస్ ని కూడా వేసుకుని మీరు టీ రూపంలో తీసుకుంటే జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి:

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అలానే దాల్చిని తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది.

ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది:

రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుండి కూడా మిమ్మల్ని బయటపడేస్తుంది. అలానే బ్యాక్టీరియల్ సమస్యలు వంటివి కూడా దరి చేరకుండా చూసుకుంటుంది. ఇలా దాల్చిని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరు రెగ్యులర్ గా దాల్చినిని తీసుకుంటూ ఉండండి. దానితో ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా మీరు చెక్ పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news