పెంపుడు జంతువులకి ముద్దు పెడుతూ వుంటారా..? దేవుడా ఎన్ని సమస్యలు వస్తాయి అంటే..?

-

చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులని పెంచుకుంటూ ఉంటారు పెంపుడు జంతువులని ఇంట్లో పెంచుకోవడం వలన బాండింగ్ బాగా పెరుగుతుంది ఆ పెంపుడు జంతువుతో అనుబంధం పెరిగితే చాలా ఆనందంగా ఉంటుంది. మన ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు కాసేపు పెంపుడు జంతువులతో కూర్చుంటే. అయితే చాలామంది పెంపుడు జంతువులని ఎంతో ప్రేమగా నిమురుతూ వుంటారు. ముద్దులు కూడా పెడుతూ ఉంటారు. మీరు కూడా అలా చేస్తున్నట్లయితే కచ్చితంగా ఈ విషయాన్ని చూడాల్సిందే. పెంపుడు జంతువుల కి ముద్దులు పెట్టడం వలన బ్యాక్టీరియా అంటుకుంటుంది.

పెంపుడు జంతువులు
పెంపుడు జంతువులు

 

కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పెంపుడు జంతువులు మట్టిలో దొర్లుతూ ఉంటాయి. అలానే చాలా రకాల వాటిని తింటూ ఉంటాయి దీంతో వైరస్ బ్యాక్టీరియా వంటివి వాటి నుండి మనకి స్ప్రెడ్ అవ్వచ్చు ఒకవేళ కనుక మనం పెంపుడు జంతువుల్ని ముద్దు పెట్టుకుంటే ఆ బ్యాక్టీరియా వైరస్లు మనకి వ్యాపిస్తాయి. పెంపుడు జంతువుల్ని ముద్దు పెట్టుకోవడం వలన దంతాల సమస్యలు వస్తాయి. నోట్లో బ్యాక్టీరియా అధికంగా చేరిపోతుంది. కాబట్టి ఈసారి ఆ పొరపాటున చేయకండి.

పొరపాటున కూడా పెంపుడు జంతువులకు ముద్దులు పెట్టకండి అలానే చాలామంది పెంపుడు జంతువులని పక్కన పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. అలా పెంపుడు జంతువులతో నిద్రపోవడం వలన తామర దురద వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. ఎలర్జీలు వంటివి వ్యాపిస్తాయి. ఒకవేళ కనుక ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే పెంపుడు జంతువులకి సరైన టైమ్ కి వ్యాక్సిన్ ని వేయిస్తూ ఉండాలి అప్పుడు చాలా రకాల సమస్యలు ఉండవు. రెగ్యులర్ గా వాటికి స్నానం చేయించాలి అప్పుడు సమస్యలు ఉండవు. పెంపుడు జంతువులని ఇంట్లో ఉంచుకునేటప్పుడు వాటికి పదేపదే ముద్దులు పెట్టడం వంటివి చేయకండి చేయకుండా ఉంటే కూడా ఈ సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news