ఏడు గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా..?

-

మన ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర కూడా బాగా ఉండాలి. ఎలా అయితే మన ఆరోగ్యం కోసం మంచి ఆహారం, వ్యాయామం అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మంచి నిద్ర ఉంటే మనకు చక్కని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రతి రోజు ఏడు గంటల పాటు నిద్రపోతే ఎటువంటి లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

 

ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్ర పోవడం వల్ల మీ మెదడు పనితీరు తగ్గుతుంది. అదేవిధంగా వివిధ సమస్యలు కూడా కలుగుతాయి. అయితే ఏడు గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల పలు లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ఏకాగ్రత పెరుగుతుంది:

ఏడు గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరచుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మంచిది. ఏడు గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.

హృదయ సంబంధిత సమస్యలు రావు:

ఏడు గంటల కంటే తక్కువ నిద్ర పోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. దీంతో హార్ట్ పై ప్రభావం పడుతుంది.

డయాబెటిస్ రిస్కు తగ్గుతుంది:

ఏడు గంటల కంటే ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. దానితో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు. చూసారు కదా ఏడు గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది కనుక ఆరోగ్యంగా ఉండటం కోసం మంచిగా నిద్రపోయి ఈ లాభాలని పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news