రోజుకు 8 గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోతున్నారా.. అయితే ఆ రిస్క్ మీకే ఎక్కువ వస్తుందట.!

మన శరీరంలో ముఖ్యమైన అవయువాల్లో మెదడు ఒకటి..అసలు శరీరంలో ఉండే ప్రతిపార్ట్ కూడా ముఖ్యమే. కానీ చాలామంది మెదడు ఆరోగ్యం పై శ్రద్ధ వహించే వారు సంఖ్య తక్కువనే చెప్పాలి. దీని ఫలితంగా చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణం అతి నిద్ర అని అధ్యయనాలు చెబుతున్నాయి. నైట్ షిఫ్ట్ వల్ల చాలామంది ఉద్యోగులు పొద్దున లేటుగా లేస్తుంటారు. లేచే సరికే మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకోతమంది నైట్ నిద్రరాక ఊరికే ఫోన్ చూస్తూ లేట్ నైట్ వరకూ మేలుకూగా ఉండి ఉదయం లేటుగా లేస్తుంటారు.

అయితే రోజుకు 6-8 గంటలపాటు నిద్రపోయే వారితో పోలిస్తే.. 8 గంటల కంటే అధికంగా నిద్రపోయే వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువ అని నిపుణలు చేసిన అధ్యయనాల చెబుతున్నాయి. వారాంతంలో ఎక్కువ సేపు నిద్రించినా పర్లేదు కానీ ప్రతిరోజు అదే పనిగా నిద్రపోతే ఎక్కువసేపు పడుకోవటం ఆరోగ్యానికి అసలు మంచిదికాదు. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతం ఉన్న జీవనశైలితో 25 ఏళ్ల వయస్సులోనే ఆకస్మిక గుండెపోటుతో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువే.

డిసెంబర్ 11, 2019న వీటిపై ఒక అధ్యయనం జరిగింది. సగటున 62 ఏళ్ల వయస్సు ఉన్న 32,000 మంది వ్యక్తులలో స్ట్రోక్ రిస్క్ గురించి పరిశోధకులు చర్చించారు. స్ట్రోక్ రేట్ల అధ్యయనంలో పాల్గొనేవారి నిద్ర తీరుతెన్నులను పరిశోధకులు విపులంగా తెలుసుకున్నారు. చైనాలోని వుహాన్‌లోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ షియోమిన్ జాంగ్ ఈ స్టడీ పేపర్ కి రచయితగా వ్యవహరించారు.

మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా తగ్గిపోయినప్పుడు మెదడు కణజాలాలు బాగా దెబ్బతింటాయట.. ఫలితంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా శరీరంలోని ఏదైనా భాగం చచ్చుపడిపోతే దానిని పక్షపాతంగా పిలుస్తుంటాం. 2019 అధ్యయనం ప్రకారం, రాత్రికి 8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, రాత్రికి 9 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో స్ట్రోక్ ముప్పు 23% ఎక్కువగా ఉంటుందని తేలింది.. అలాగే మధ్యాహ్నం వేళ 30 నిమిషాల కంటే తక్కువసేపు నిద్రపోయే వారితో పోలిస్తే.. కనీసం 90 నిమిషాలు నిద్రపోయే వ్యక్తుల్లో పక్షవాతం వచ్చే ముప్పు 25% ఎక్కువ ఉంది. అసలు మధ్యాహ్న నిద్ర మంచిదికాదని డాక్టర్లు చెబుతునే ఉంటారు. అంతేకాదు, ఎక్కువసేపు నిద్రపోయినప్పటికీ.. చక్కటి నిద్ర పట్టట్లేదని ఫిర్యాదు చేసేవారిలో స్ట్రోక్ ప్రమాదం 82% పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆ తరువాత కూడా తరచుగా నిద్రకు భంగం కలుగుతూనే ఉంటుంది. సగానికిపైగా వ్యాధిగ్రస్తులు నిద్రలేమితో బాధపడుతుంటారు. నిద్ర లేమి కారణంగా మెదడు క్షీణతకు అందించే చికిత్స నిరుపయోగంగా మారుతుంది. నిద్రలేమి వల్ల తీవ్ర విచారంతో పాటు జ్ఞాపకశక్తి సమస్యలు కూడా తలెత్తుతాయట. ఈ సమస్యకు ప్రధాన కారణం..ఎక్కువ నిద్ర, ఎక్కువసేపు మధ్యాహ్న నిద్రలు లేదా పేలవమైన నిద్ర నాణ్యత మధ్య సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి.

అయితే కేవలం వీటివల్ల మాత్రమే ఈ సమస్య వస్తుందని చెప్పలేం. ఇ‌వి కూడా కారణాలుగా మారతాయి అంతే. ఎందుకంటే ఈ పరిశీలనలకు ఇతర అంగీకార యోగ్యమైన కారణాలు ఉన్నాయి. ఎక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరిగిపోయి బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు. అధికబరువు, ఎక్కువ నిద్ర రెండూ స్ట్రోక్‌కు ప్రమాద కారకాలు అని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్రెయిన్ స్ట్రోక్ 80 శాతం నివారించేందుకు మార్గం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మెరుగైన జీవనశైలి అన్ని స్ట్రోక్ ప్రమాదాలలో 80% వరకు నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు. మితమైన వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, ధూమపానం, అధిక మద్యపానం, మాదకద్రవ్యాలకు వీలైనంత దూరంగా ఉండటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇవే కాదు మనిషి శరీరంలో వచ్చే ప్రతీ అనారోగ్య సమస్యకు ఇవే ప్రధాన కారణాలు. మంచి పోషకవిలువలు ఉన్న ఆహారం , లైఫ్ స్టైల్ లో మార్పు చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణలు చెబుతున్నారు.