ఒకప్పుడు చలిని తట్టుకోవడాని పొద్దున్నే చలిమంటలు వేసుకునే వారు..ఇప్పటికీ పల్లెటూర్లలో ఇలానే చేస్తున్నారు అనుకోండి. అయితే..నగరాల్లో కొందరు..చలిని తట్టుకోవడానికి..ఎంఀడాకాలంలో ఎలా అయితే ఏసీలు వాడతారో..అలా ఈ శీతాకాలంలో హీటర్లను వాడుతున్నారు..దీనివల్ల రూం అంతా వేడిగా మారి.. మంచిగా ఉంటుంది..గాలిలోని తేమను గ్రహించి ఉష్ణోగ్రతను పెంచటం ఈ హీటర్ల పని.దీంతో విపరీతంగా ఉన్న చలి తగ్గుతుంది. కానీ.. ఈ హీటర్ల వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా.? అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆక్సిజన్ తగ్గుతుంది..
దీనివల్ల జరిగే ఇంకో నష్టం ఏంటంటే..గదులలో హీటర్లను ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీంతో తలుపులు మూసి ఉండి బయటకు గాలి లోపలికి, లోపలి గాలి బయటకు వెళ్లకుండా ఉండే గదుల్లో ఉన్న వారికి వికారం, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి హీటర్లు వాడుతున్నప్పటికీ లోపలి గాలి బయటకు వెళ్లేలా చూసుకోవడం మంచిది.
చిన్నారులపై తీవ్ర ప్రభావం..
హీటర్లు చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి..ముఖ్యంగా సున్నితంగా ఉండే చిన్నారుల చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. అలాగే హీటర్ల నుంచవచ్చే వేడి గాలిని పీల్చుకోవడం ద్వారా చిన్నారుల ముక్కు భాగంలో పలు సమస్యలు ఎదురవుతాయని వైద్యులు అంటున్నారు.
మెదడుపై ప్రభావం..
ఇంకా పెద్ద నష్టం ఏంటంటే…ఈ విషయం చాలా మందికి తెలియదు.. హీటర్లు కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువులను నేరుగా పీల్చుకోవడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. ఆస్తమాతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ.. హీటర్లు ఉన్న గదుల్లో ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తన్నారు.
చర్మ సంబంధిత సమస్యలు..
హీటర్ల పని ఏంటి.. గదిలో ఉండే తేమను తగ్గించడం. తద్వారా.. చర్మంలోని తేమ కూడా తగ్గుతుంది. ఈ కారణంగా చర్మంపై దురద, అలర్జీలు వస్తాయి. సున్నితంగా చర్మం ఉన్న వారికి ఈ ప్రభావం మరీ ఎక్కువ ఉంటుందట.
ఇలా మనం వేడికోసం తెచ్చిపెట్టుకున్న హీటర్లు..మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో..హాటర్లు వాడుతున్నట్లైతే..వెంటిలేషన్ ఉన్న గదుల్లో వాడటం మంచిది. అదికూడా పైన చెప్పిన సమస్యలు లేని వారు మాత్రమే.
-Triveni Buskarowthu