బీపీ పెరిగిపోతుందా..అయితే ముల్లంగిని తింటే ఎంతో మేలట..!

-

చలికాలంలో వివిధరకాల కూరగాయలు వస్తుంటాయి. మార్కెట్ అంతా భలే రంగులమయంగా మారుతుంది. తెల్లక్యాబేజీ, తెల్లముల్లింగి, ఎర్రని క్యారెట్లు, ఆకుపచ్చ కూరగాయాలు ఇలా అన్నీ ఉంటాయి. అయితే ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా తమ ఆహారంలో ముల్లింగిని చేర్చుకోవటం మంచిది. ముల్లంగి తినడం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది , రక్త నాళాలకు ప్రయోజనం. ముల్లంగి తినడం వల్ల శరీరానికి కలిగే 5 ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రక్తపోటు నియంత్రణలో ఉంచండి

రక్తపోటు ఉన్న రోగి తప్పనిసరిగా ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవాలి. ముల్లంగిలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కాబట్టి రక్తపోటు ఉన్నవారు..ముల్లంగిని తినటం చాలామంచిది.

2. రక్తనాళాలను బలపరుస్తుంది

ముల్లంగిలో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను బలంగా చేయడంలో సహాయపడుతుంది. ముల్లంగి అథెరోస్క్లెరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది

ఈరోజుల్లో ఇమ్యునిటీ పవర్ మనిషికి ఎంత ఉపయోగమో మనందరికి తెలిసిందే. ముల్లంగి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. తద్వారా దగ్గు , జలుబు సమస్య మిమ్మల్ని బాధించదు. ముల్లంగి తినడం వల్ల వాపు, మంట సమస్య కూడా తగ్గుతుంది.

4. జీవక్రియను పెంచుతుంది

ముల్లంగి తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. దీని వినియోగం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఎసిడిటీ, ఊబకాయం, గ్యాస్ట్రిక్ సమస్యలు, వికారం వంటి సమస్యలు ముల్లంగిని తీసుకుంటే నయమవుతాయి.

5. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ముల్లంగి తినడం ద్వారా, గుండె సరిగ్గా పనిచేస్తుంది. ముల్లంగిలో గుండెకు మేలు చేసే ఆంథోసైనిన్లు ఉంటాయి. రోజూ ముల్లంగి తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయట. ముల్లంగిలో మంచి మొత్తంలో ఫోలిక్ యాసిడ్ , ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.

ముల్లంగిలో ఉన్న ముఖ్యమైన ప్రయోజనాలు ఇవి..ప్రతి కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. కానీ మనమే..రుచి బాగుండదని కొన్నింటిని దూరం పెడుతుంటాం. మనకు నచ్చిన కూరగాయలైనా సరే..కనీసం నెలలో రెండు సార్లు తినటానికి అయినా ప్రయత్నించాలి.

Read more RELATED
Recommended to you

Latest news