నైట్ షిప్ట్స్ చేస్తున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

సరైన నిద్రలేకపోతే..సకల రోగాలు తిష్టవేసుకుని కుర్చుంటాయ్. నిద్రలేకపోతే కళ్లుకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారేమో..మెదడుకే కాదు..శరీరంలోని మిగతా అవయువాలపై కూడా ప్రభావం ఉంటుంది. నిద్రలేక చనిపోయిన వారు కూడా ఉన్నారని మీకు తెలుసా..ఒక వ్యక్తి ఫుట్ బాల్ మ్యాచ్ కోసం 48 గంటలపాటు నిద్రపోలేదు. కానీ గుండెపోటుతో మరణించాడు..ఇంకా స్టూడెంట్స్ కూడా సరిగ్గా ఎగ్జామ్స్ రోజుల్లోనే…తెగ కష్టపడి నిద్రాహారాలు మానేసి చదువుతుంటారు. కానీ అలా చేయకూడదు.

నిద్రలేకపోవటం వల్ల ముఖ్యంగా బ్రెయిన పాడవుతుందట. అది కాస్త అల్జీమర్స్ కు దారితీస్తుంది..దీంతో మనుషుల పేర్లు, ముఖాలు మర్చిపోతారట. ఇంతటితో ఆగదు.. హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మనం శరీరంలోని అవయువాలన్నింటికి రెస్ట్ దొరికేది మనం నిద్రపోయే సమయంలోనే కదా..మిగతా టైంలో మీరు ఏం పనిచేయకున్న అవయువాలు మాత్రం వాటిపని అవి చేయాల్సి ఉంటుంది. మనిషి ఆరుగంటల కంటే తక్కువగా నిద్రపోతే..గుండెపోటు వచ్చే ప్రమాదం 4.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువగా ఉంటుంది.

నిద్రపోయేటపుడే గ్రోత్ హార్మోన్లు విడుదలవుతాయి. మీరే చూడండి..ఒక రోజంతా నిద్రలేకకపోతే..మీ ముఖం ఎంత డల్ గా మారిపోతుందో.. మన బ్రెయిన్‌లోని స్ట్రెస్‌ హార్మొన్స్‌ ఎక్కువగా విడదలవ్వడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల చర్మం సాగిపోతుంది. నిద్రపోతే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎక్కువ సేపు నిద్రపోయేవారు 10 ఏళ్లు తక్కువగా కనిపిస్తారట. దీన్నే బ్యూటీ స్లీప్‌ అంటారు. అంతేకాదు నిద్రలేకపోవడం వల్ల మానసికంగా, శారీరకంగా వీక్‌గా కనిపిస్తారు.

ఉత్సాహాంగా ఉండేలేరు.. ముఖ్యంగా నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసేవారికి భవిష్యత్తులో కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయట… డయాబెటీస్, ఒబేసిటీ, గుండె సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. ఇదేదో మిమ్మల్ని భయపెట్టానికి చెప్పటంలేదు..అక్షరసత్యం.. అందుకే నైట్‌షిఫ్ట్‌లు చేసేవారు సరైన ఆహారం తీసుకోవడం మంచిది. నిద్రపోయి 24 గంటలు దాటితే మన మెదడు తెలియకుండానే మైక్రోస్లీప్స్‌ తీసుకుంటుంది. ఇది ఒక సెకను నుంచి హాఫ్‌ మినట్‌ వరకు ఉంటుంది. అందుకే నైట్ షిప్ట్లో లో మనకు తెలియకుండానే..రెండుమూడు నిమిషాలకే నిద్రపోతుంటాం..ఇంకా చాలా యాక్సిడెంట్లు కూడా ఈ కారణంగానే అవుతుంటాయి. అమెరికాలో ప్రతి ఏడాది నిద్ర లేకపోవడందో జరిగిన కార్‌ యాక్సిడెంట్లు 2 లక్షలకుపైగానే ఉన్నాయట.

ఇక విద్యార్థులు కూడా రాత్రంతా చదువుతారు. ఇది వారికి నష్టమే అవుతుంది.. ఈ వయసునుంచే అలా చేయటంవల్ల బ్రెయిన్‌లో ఉండే ప్రీఫ్రంటల్‌ నరాలు వీక్‌ అవుతాయి. దీంతో పరీక్ష సమయంలో ఏమి గుర్తు రాకపోవడంతోపాటు.. అలసట, చిరాగ్గా ఉంటుంది. త్వరగా పడుకోని తెల్లవారుజాము చదువుకోవటం ఉత్తమం.

స్లీప్‌ పెరాలసిస్‌ ఇది చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. నిద్రలో ఎవరో మనల్ని నొక్కి పట్టుకున్నట్లు ఉంటుంది. పైకి లేచే ప్రయత్నం చేస్తాం కానీ, లేవలేని పరిస్థితి ఉంటుంది. దీన్నే కొంతమంది దెయ్యం పట్టింది అంటుంటారు.. ఈ సమయంలో మనం నిద్రపోతాం కానీ, మన బ్రెయిన్‌ మెలకువగా ఉంటుంది. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం వలనే ఇలా జరుగుతాయి. నిద్రలో లేచి నడవటం, మాట్లాడం కూడా నిద్రలేమి వల్లే జరుగుతాయి.

నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ ప్రకారం చిన్న పిల్లలకు 9–11 గంటల నిద్ర, టీనెజర్లకు 8–10 గంటలు, పెద్దవాళ్లకు 7–9 గంటలు, ముసలివయస్సు వారికి 7–8 గంటల నిద్ర అవసరమని తేల్చింది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఎన్ని గంటలు పడుకోవాలో, ఎన్ని గంటలు పడుకుంటున్నారో చూడండి.