చాలా మంది అధిక బరువుతో ఉంటారు. అయితే బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బరువు తగ్గడం అవ్వదు. మీరు కూడా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువుతో ఉన్నారా..?, బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వడం లేదా..?
అయితే మీకోసం కొన్ని చిట్కాలు. ఉదయంపూట ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా బరువు తగ్గొచ్చు. అయితే మరి ఎలా బరువు తగ్గొచ్చు అనేదాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.
వెల్లుల్లి:
ఉదయాన్నే లేచి వెల్లుల్లిని ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తీసుకుంటే త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉదయం పూట ఈ విధంగా ఫాలో అవ్వండి.
ఇడ్లీ:
ఉదయం పూట అల్పాహారం కింద ఇడ్లీ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఆపిల్స్:
ఆపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఓట్ మీల్:
ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఉదయం పూట దీనిని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఉదయం పూట బర్గర్లు, పిజ్జాలు, చీజ్ వంటివి ఎక్కువ తీసుకోవద్దు. కొంచెం వ్యాయామం చేయడం, ఖాళీ కడుపున ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవడం, తినడానికి ముందు ఎక్కువ నీళ్లు తాగడం, రాత్రి సులభంగా డైజేషన్ అయ్యేటట్టు తక్కువ ఆహారం తీసుకోవడం, ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ఇలాంటి పద్ధతులు అనుసరించండి. ఇలా ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా త్వరగా బరువు తగ్గొచ్చు.