పీతలతో గుండె ఆరోగ్యం పదిలం. కానీ ఈ రకం ఎక్కువగా తింటే విషమే..!

-

సీ ఫుడ్ అంటే అందరూ చేపలు, రొయ్యల వరకే ఆలోచిస్తారు.. చాలా తక్కువ మంది పీతలను తింటారు. ఎందుకో అవి చూడ్డానికి కాస్త తేడాగా ఉండంటో వాటిని తినేందుకు ఎవరూ అంత ఇంట్రస్ట్‌ చూపరు. కానీ పీతలు తినడం వల్ల కూడా మంచి ఆరోగ్యం పొందవచ్చు. విటమిన్ B12, ఫోలేట్ ,ఇనుము, నియాసిన్, సెలీనియం, జింక్పీతలో వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పీత ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి మరియు నిర్వహించడానికి కీలకంగా తోడ్పడుతుంది.

పీతలో విటమిన్ B12 మరియు సెలీనియం కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ పోషకాలు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. వివిధ రకాల దీర్ఘకాలిక పరిస్ధితులను నివారించటంలోనూ ఇవి చక్కగా సహాయపడతాయి. పీతలలో ట్యూనా చేపల కంటే తక్కువ స్థాయి పాదరసం ఉంటుంది.

పీతలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ముఖ్యమైన పోషకాలు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. క్రమరహిత హృదయ స్పందన లేకుండా తోడ్పడుతుంది.

వారానికి ఒకసారైనా పీత వంటి సీఫుడ్ తినే వ్యక్తులలో చిత్త వైకల్యం, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనల్లో తేలింది. ఈ సీఫుడ్ ఉత్పత్తులలో కనిపించే అధిక స్థాయి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల నుండి ఉత్పన్నమవుతుంది. విటమిన్ B12, ఫోలేట్‌తో సహా పీతలో ఉండే అనేక పోషకాలు విటమిన్ లోపం అనీమియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. ఈ సారి పీతలను ట్రే చేయండి.. మీకు తెలుసో లేదో.. పీతలను తినే వాళ్లు చేపలకంటే పీతలనే ఎక్కువగా ఇష్టపడతారట. అయితే పీతల్లో అన్నీ మంచివే కానీ బ్రౌన్‌ పీత వద్దు అంటున్నారు నిపుణులు.

ఈ పీత ఎక్కువగా వద్దూ…

బ్రౌన్ పీత మాంసంలో అధిక మోతాదులో కాడ్మియం కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే విషపూరితంగా మారే అవకాశాలు ఉంటాయి. పీతలో సోడియం కూడా ఉంటుంది. 85 గ్రాముల పీతల మాంసంలో 237 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news