గుర‌క‌తో గుండెపోటు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

-

స‌హ‌జంగా రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోవాలని అందరికీ ఉంటుంది. కానీ పక్కనున్న వ్యక్తి తీవ్రమైన భరించలేనంత శబ్దాలతో గురక పెడుతూ ఉంటే ఎవరికైనా న‌ర‌కంగానే ఉంటుంది. ఇది సాధారణంగా చాలా మందిలో ఉండే సమస్య. రకరకాల మానసిక ఒత్తిళ్లు, సమస్యలతో నిద్రమాత్రలు వాడే వారు, ధూమపాన ప్రియులు, మత్తు పానీయాలు సేవించే వారు ఈ గురక భారిన పడుతుంటారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం గుర‌క వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం ఉందంటున్నారు నిపుణులు.


శారీరక శ్రమ చేయకుండా ఊరకనే కూర్చోవడం వల్ల కూడా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే సిగరెట్టు తాగడం ఎంత ప్రమాదమో శారీరక శ్రమ చేయకపోవడమూ అంతే ప్రమాదకరం. ఇక స్థూలకాయులు, ఫారింజైటిన్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా గురకతో ఇబ్బంది పడుతుంటారు. గొంతులో ఉండే ఫారింక్స్ కణజాలం కదలికల వల్ల నిద్ర మధ్యలో గురక వస్తుంది. అయితే వీరికి ఎక్కువగా గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని తాజా ప‌రిశోధ‌న‌లో తేలింది.

గురక వల్ల ఊపిరి ఆగిన సమయంలో గుండెకు సరైన ఆక్సిజన్‌ అందకపోతే గుండెపోటు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అదే విధంగా గుర‌క పెట్టే వారికి నిద్ర లేమి, పక్షవాతం, రక్తపోటు వంటి పలురకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. యోగా, ప్రాణాయామం వంటి ప్రక్రియల ద్వారా గురకకు చెక్ పెట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని ప‌రిశోధకులు హెచ్చ‌రించారు. అలాగే నిద్రపోయే ముందు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం వల్ల గురక సమస్యను నివారించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news