Monkey Pox : మంకీపాక్స్ పిల్లలకు వస్తే ఎంత ప్రమాదకరం..? రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే..?

-

Monkey Pox : మంకీ పాక్స్ గురించి చాలా మందిలో అవగాహన లేదు. మంకీ పాక్స్ చాలా ప్రమాదకరమైనది. మంకీ పాక్స్ పిల్లలకి వస్తే ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డాక్టర్లు తెలిపారు. వెస్ట్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా లో ఈ ఇన్ఫెక్షన్ కారణంగా చాలామంది బాధపడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్లైన్స్ ని కూడా జారీ చేసింది. మంకీ పాక్స్ వైరస్ అనేది ఆర్తోపోక్స్ వైరస్ జాతికి సంబంధించినదని నిపుణులు తెలిపారు. 1958 లో డెన్మార్క్ లో మొట్టమొదట ఈ వైరస్ ని కనుగొనడం జరిగింది. 2022లో మంకీపాక్స్ 70 దేశాలకు పైగా వ్యాపించింది.

ఎలా వ్యాపిస్తుంది..?

పగిలిపోయిన చర్మం, రెస్పిరేటరీ సిస్టం ద్వారా ఇది వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తికి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా మసాజ్, కిస్సింగ్ వంటి పద్ధతులు ద్వారా కలుగుతుంది. ఈ వైరస్ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉంటే ఇతరులకి కూడా సోకుతుంది. గర్భిణీలు ఈ వైరస్ బారిన పడితే కడుపులో బిడ్డకి కూడా ఈ వైరస్ కలుగుతుంది.

ఎవరికి వస్తుంది?, ఎలా కంట్రోల్ చేయాలి?

రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం, ఇది వరకు స్మాల్ బాక్స్ కి టీకాలు వేసారు. స్మాల్ పాక్స్ టీకాలు తీసుకొని పిల్లలకు ఇది హాని చెయ్యొచ్చు.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిల్లలు మంకీ బాక్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ మంకీ పాక్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. పిల్లలు ముఖ్యంగా ఐదేళ్లు కంటే తక్కువ వయసు ఉన్నవారు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నిమోనియా వంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్లలో ఇది వ్యాపించే అవకాశం ఉంటుంది.
దద్దుర్ల నుంచి మచ్చలు దీర్ఘకాలిక పరిమాణాలకు దారి తీస్తుంది. వ్యాక్సినేషన్ వేయించడం వలన పిల్లలకు ప్రమాదం కలగదు. మంకీ పాక్స్ కేసుల్ని ముందస్తు గుర్తించి ట్రీట్మెంట్ చేయడం వలన వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడవచ్చు.
మంకీ బాక్స్ గురించి అవగాహన పెంచడానికి ప్రభుత్వ విద్యా ప్రచారాలను మొదలుపెట్టాలి అప్పుడు రిస్క్ ఎక్కువగా ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version