ఈ పప్పులు తింటే.. ఈజీగా బరువు తగ్గేయొచ్చు.!

-

ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా.. యువత అంతా అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. వేళాపాలా లేకుండా తినడం. సమయంతో పనిలేకుండా వర్క్ చేయడం.. వెరసి చెప్పాపెట్టకుండా బాడీ ఉబ్బిపోతుంది. ఇంట్లో ఉన్నవాళ్లు తొలిదశలో గమనించలేరు. సడన్గా ఎవరైనా కొత్తవారు ఇంటికి వస్తే.. వాళ్లు చెప్తారు. అరే ఈమధ్య కొంచెం లావు అవుతున్నావ్ అని..ఇక అప్పటినుంచి.. మైండ్ లో ఒక రకమైన చిరాకు.. తగ్గాలి తగ్గాలి అని.. కానీ ఎక్సర్ సైజ్ చేసే టైం లేదు.. డైట్ చేసే ఓపిక లేదు. మరి ఎలా.. ఈ స్జేజ్ లో ఉన్నవారు.. కాస్త ఫుడ్ మీద ప్రత్యేక శ్రద్ద పెడితే బరువు ఈజీగా తగ్గేయొచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే పప్పులు వల్ల సన్నబడొచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో చూద్దామా..!

పప్పులతో కొవ్వు కరుగుతుంది..

పప్పులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలోని కొలెస్ట్రాల్‌తో కలిసి.. శరీరం నుంచి తొలగిస్తుంది. పప్పులో ఉండే మెగ్నీషియం, ఫోలేట్ గుండె జబ్బుల నుంచి కూడా రక్షిస్తాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ధమనులను రక్షించడానికి ఈ ఖనిజాలు తోడ్పడతాయని
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) నివేదిక చెప్తోంది.

కంది పప్పు

కంది పప్పులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలం గా ఉంటాయి. ప్రొటీన్ మంచి ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంకా ఫైబర్ బాడీ లోనించి కొలెస్ట్రాల్ ని తరిమి కొట్టడానికి ఉపయోగపడతాయి. కంది పప్పులో ఉండే బీ కాంప్లెక్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. కంది పప్పుతో ముద్దపప్పు, కంది పచ్చడి, కంది పొడి, ఆకు కూరలు వేసి పప్పు లాంటి వంటకాలు చాలా సులభంగా చెయ్యెచ్చు. టేస్టీగా ఈ పప్పు తింటూ బరువు తగ్గొచ్చు. కంది పప్పు తింటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

పెసరపప్పు..

పెసరపప్పులో మాంగనీస్, మెగ్నీషియం, పొస్పరస్‌, కాపర్, పొటాషియం, జింక్, ఫోలేట్ విటమిన్లు, ప్రోటిన్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయి. అన్ని పప్పుల కంటే పెసర పప్పు చాలా తేలికగా జీర్ణమవుతుంది. తినడానికి టేస్ట్‌గానూ ఉంటుంది. పెసరపప్పు తింటే.. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.

మినప పప్పు

తెలుగు రాష్ట్రాల్లో మినపప్పు లేకుండా.. టిఫెన్స్ చేయరు. దీనిలో ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ల్‌ ఏ, సీ ఉన్నాయి. ఇందులో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్ రెండూ ఉన్నాయి. మినపపప్పు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మినపపప్పు తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. మినపపప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. అయితే వండుకునే తీరును బట్టే ఇవన్నీ బాడీకీ అందుతాయి.

ఎర్రకంది పప్పు

దీన్నే మైసూరు పప్పు అంటారు. ఈ పప్పుతో చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎర్రకంది పప్పులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, బి విటమిన్లు, ఫోలేట్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రొటీన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటటం వల్ల ఎర్రకంది పప్పు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఉలవలు..

ఉలవలను మన రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉలవలులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది అధిక బరువు ఉన్నవారు తింటే.. మంచిది. శరీరంలోని కొవ్వు కరిగించడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. శాఖాహారులు ప్రోటిన్‌ కోసం, ఉలవలు తీసుకుంటే చాలా మంచిది. ఉలవలతో చారు, ఉడికించి గుగ్గీలు చేసుకుని తినొచ్చు.
ఈ పప్పులను వారానికి ఒకటి చొప్పున తిన్నా.. బాడీకీ కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. మినపప్పు, కందిపప్పు అందిరి ఇళ్లలో వాడతారు కాబట్టి.. మిగిలిన వాటి మీద కూడా ఇకనుంచి ప్రత్యేక శ్రద్ద పెట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news