ఈ పదార్ధాలని నానబెట్టుకుని తీసుకుంటే ఆరోగ్యం మరెంత బాగుంటుంది..!

-

ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా అందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఆరోగ్యకరమైన టిప్స్ ని పాటించండి.

Soaked almonds

 

ఈ టిప్స్ ని కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. పైగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

బాదం:

బాదం నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకుంటే యాసిడిటీ, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ప్రోటీన్ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది.

అవిసె గింజలు:

నానపెట్టిన అవిసె గింజల్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. నానబెట్టిన అవిసె గింజల తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఎండు ద్రాక్ష:

ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. ఎనిమియా, కిడ్నీ సమస్యలు, చర్మ సమస్యలకు చాలా మంచిది ఎండు ద్రాక్షని నానబెట్టుకుని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ కూడా అందుతాయి. హైబీపీ తో బాధపడే వాళ్లకు ఇది చాలా మంచిది.

మెంతులు:

మెంతులు మనం వంటలు ఎక్కువ ఉపయోగిస్తుంటాం. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే కూడా మంచిది. వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది అలాగే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు ఇది చాలా మేలు చేస్తుంది.

మొక్క పెసలు:

మొక్క పెసలు లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ కూడా ఉంటాయి. జీర్ణ సమస్యలను ఇది పోగొడుతుంది. గ్యాస్ కాన్స్టిట్యూషన్ వంటి వాటి నుండి కూడా బయటపడొచ్చు. కనుక ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అలానే సమస్యలు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news