చలికాలంలో ఈ పండ్లను తీసుకుంటే… సమస్యలు వుండవు..!

-

చలికాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా చాలా మంది చలికాలంలో అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. చలికాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి.

vitamin c fruits

ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం వీటిని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా పోషకాలు లభిస్తాయి. అలానే అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూసుకుంటాయి. పిల్లలకి కూడా వీటిని పెట్టండి దానితో వారిలో కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

బ్లాక్ గ్రేప్స్:

నల్ల ద్రాక్షని పిల్లలకి పెట్టండి దీని వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలానే పెద్దలు కూడా తీసుకోవచ్చు. పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. అలానే విటమిన్ సి కూడా ఉంటుంది చలికాలంలో నల్ల ద్రాక్ష తీసుకుంటే చాలా మంచిది.

ఉసిరి:

ఉసిరి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఉసిరిలో పోషక పదార్థాలు నిండుగా ఉంటాయి చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

దానిమ్మ:

దానిమ్మ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి విటమిన్ కే కూడా ఇందులో ఉంటాయి. అలానే ఐరన్ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బ్యాక్టీరియాని తొలగిస్తుంది.

క్యారెట్:

క్యారెట్ కూడా పిల్లలకు చాలా మంచిది పెద్దలు కూడా క్యారెట్ తినొచ్చు. కంటి చూపు మొదలు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మనం క్యారెట్ ద్వారా పొందొచ్చు. కనుక రెగ్యులర్ గా క్యారెట్ ని కూడా మీరు తీసుకోవచ్చు.

నారింజ:

నారింజలో విటమిన్ సి ఉంటుంది. అలానే పొటాషియం ఫాలైట్ కూడా ఉంటుంది ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news