కళ్లు లేనిది జీవితం లేదు.. లైఫ్ అంతా అంధకారమే.. కళ్లలో చాలా రకాలు ఉంటాయి. నీలి కళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్యక్తి నుంచి వచ్చినట్లు సైంటిస్టులు చెబుతారు. సుమారుగా 10వేల ఏళ్ల కిందట నల్ల సముద్రం దగ్గర నివసించిన ఓ వ్యక్తికి జన్యు పరమైన మార్పుల వల్ల కళ్లు నీలి రంగులోకి మారాయట.. అందువల్లే ఆ వ్యక్తి జన్యువులు నీలి కళ్లు ఉన్నవారికి వచ్చి ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు. మన శరీరంలో అన్ని అవయవాల కన్నా కన్నుకు గాయం అయితే చాలా త్వరగా మానుతుంది. ఇక కార్నియాకు మరమ్మతులు చేసేందుకు కళ్లకు కేవలం 48 గంటల సమయం మాత్రమే పడుతుంది.
కళ్లకు సంబంధించి ఆశ్యర్యకరమైన విషయాలు..
అప్పుడే పుట్టిన వారికి కన్నీళ్లు రావు. వారు ఏడ్చినట్లు శబ్ధాలు చేస్తారు. 4-13 వారాల వయస్సు వస్తే వారికి కన్నీళ్లు వస్తాయి.
కొందరికి ఒక కన్ను ఒక కలర్‌లో, ఇంకో కన్ను మరో కలర్‌లో ఉంటాయి. ఈ స్థితిని హెటెరోక్రోమిక్ అని అంటారు.
అప్పుడే పుట్టిన పిల్లల కళ్లు పెద్దల కళ్లలో 65 శాతం సైజులో ఉంటాయి. వారు యుక్త వయస్సు వచ్చే సరికి మిగిలిన 35 శాతం కళ్లు పెరుగుతాయట.
మనం నిత్యం చూసే వాటికి చెందిన విషయాలను 80 శాతం వరకు కళ్లు గుర్తుపెట్టుకుంటాయి.
మనిషి శరీరంలో అత్యంత క్లిష్టమైన అవయవాల్లో మెదడు తరువాత కళ్లే ఉన్నాయి.
మనిషి ఒక కన్ను బరువు సుమారుగా 7.09 గ్రాముల వరకు ఉంటుంది.
మనిషి కళ్లు సుమారుగా 1 కోటి వరకు భిన్న రకాల రంగులను గుర్తించగలవట.
మన కళ్లు యుక్త వయస్సు వచ్చే వరకు పెరుగుతాయి. తరువాత పెరుగుదల ఆగిపోతుంది. కానీ ముక్కు, చెవులు మాత్రం జీవితాంతం పెరుగుతూనే ఉంటాయట..
ఏడాదిలో మనం కళ్లను సుమారుగా 42 లక్షల సార్లు ఆర్పుతాం.
కళ్లలో సుమారుగా 20 లక్షల చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయట..
ఒక్కో కంటిలో సుమారుగా 10.7 కోట్ల కణాలు ఉంటాయి. ఇవి కాంతిని తట్టుకోలేవు..
మన శరీరంలో అత్యంత వేగవంతమైన కండరాలు కళ్లలో ఉంటాయి.
ప్రపంచంలో అధిక శాతం మంది కళ్లు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి.
నీలి కళ్లు కావాలనుకునే వారు బ్రౌన్ కలర్ కళ్లకు సర్జరీ చేయించుకోవచ్చు. లేదా లెన్స్ ధరించవచ్చు.
కళ్లను చూస్తే కొందరికి భయం కలుగుతుంది. దాన్ని Ommetaphobia అంటారు.
చెవులకు రింగులను ధరించడం వల్ల కంటి చూపు పెరుగుతుందని సముద్రపు దొంగలు భావిస్తారు. అందుకనే వారి చెవులకు పోగులు ఉంటాయి.
మనిషి కన్నును ఒక కెమెరాగా భావిస్తే.. దాని కెపాసిటీ 576 మెగాపిక్సల్స్. ప్రస్తుతం 108 మెగాపిక్సల్స్ కెపాసిటీ ఉన్న కెమెరాలు కలిగిన ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. అంటే ఎంత పవర్‌ఫుల్‌లో చూడండి..
పులులు రాత్రి పూట మనుషుల కన్నా 8 రెట్లు ఎక్కువ స్పష్టంగా చూడగలవు.
కళ్లు ఎంత విలువైనవో కదా.. మనం వాటిని చాలా అశ్రద్ధగా చూస్తున్నాం.. విలువ అనేది అవి లేనప్పుడే తెలుస్తుంది. అవసరానికి మించి ఫోన్లు వాడటం, స్క్రీన్ ఎక్కువగా చూడటం తగ్గించండి.. కాలేజ్ టైంలోనే కళ్లను చాలా మంది పాడుచేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాలి.. రోజుకు 8-9 గంటల పాటు స్క్రీన్ చూడాలి.. టెన్షన్ ఉంటుంది. మీ కళ్లు ఇప్పుడే ఆగం అయితే. ఇక కెరీర్ ఎట్లా మచ్చా..! ఇంట్లోంచి అడుగుబయట పెట్టగానే..చెవుల్లో ఈర్‌ఫోన్స్ పెట్టకండి.. కొన్ని ఉద్యోగాలు చెవులకు పనిచెప్తాయి.. విని చేయాలి, మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు మీరు పాటలు వినాలన్నా..చెవులు తట్టుకోలేవు.. ఈ అవయవాలు పాడవకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి.!