గర్భవతులు ప్రయాణం చేస్తే బిడ్డకు ప్రమాదమా?తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు గర్భం దాల్చినప్పుడు ఎంతో సంతోషిస్తారో అందరికి తెలుసు..అయితే గర్భవతులుగా ఉన్నప్పుడు నుంచి కనేవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఏమి తినాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఎలా పడుకోవాలి, ప్రయాణం చేయవచ్చా అని.. గర్భిణిలకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో.. ప్రయాణం చేయవచ్చా అని చాలా మందికి డౌట్‌ ఉంటుంది. గర్భానికి ఏమైనా ప్రమాదం ఉందా అని అనుమాన పడతారు. తాము ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, విహారయాత్రలకు దూరప్రయాణాలు చేయవచ్చా అని డాక్టర్లను అడుగుతారు. నిజానికి వీరు ప్రయాణాలు చెయ్యడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

 

తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆరునెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి డెలివరీ అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటాం. మొదటి మూడు నెలలు గర్భిణికి వికారం, వాంతులు ఉంటాయి. ఈ సమయంలో ఎమర్జన్సీ అయితేనే ప్రయాణం చేయాలని వైద్యులు అంటున్నారు. ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. కొంతమందిలో మొదటి మూడు నెలలు కడుపునొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు ఉంటాయి. అలాంటివారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండటం బెస్ట్.. ఇంక అత్యవసరం అనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి.

మూడో ట్రైమిస్టర్ కూడా ప్రయాణాలకు అనుకూలమే. కాకపోతే తొమ్మిదోనెల దాటాక ప్రయాణాలు అంత మంచివి కాదు. ఇక 32-34 వారాల ప్రెగ్నెన్సీ సమయం నాటికి.. డెలివరీ ప్లాన్‌ చేసుకునే చోటికి వచ్చి ఉండటం మంచిది. తొమ్మిదో నెల తర్వాత నొప్పులు ఏ సమయంలో అకస్మాత్తుగా వస్తాయో తెలియదు..ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు.. ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

*. దూరప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు తమ డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి. గర్భిణికి, శిశువుకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రయాణం చేయాలి.

*. గర్భిణికి, శిశువుకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రయాణం చేయాలి. ఇరుకుగా ఉన్న సీట్లల్లోనూ, కుదుపులు ఎక్కువగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయకూడదు.

*. కారులో ప్రయాణం చేస్తే రెండు గంటలకు ఆపి అటు, ఇటు నడవాలి..

*. త్వరగా జీర్ణం అయ్యే ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.. అప్పుడే కూర్చున్న అజీర్థి సమస్యలు రాకుండా ఉంటాయి..

34 వారాలు వచ్చిన తర్వాత ఎటువంటి దూర ప్రయాణాలు పెట్టుకోక పోవడం మంచిది..