ఒత్తిడి ఎక్కువైందా..? అయితే ఈ విటమిన్స్ ని మరచిపోవద్దు..!

చాలామంది అధిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు వివిధ రకాల కారణాల వలన ఒత్తిడి సహజంగా వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడం కొంచెం కష్టమే కానీ కాస్త ప్రయత్నిస్తే ఎంతో ఈజీగా ఒత్తిడిని అధిగమించవచ్చు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే మెడిటేషన్ వంటివి సహాయపడతాయి.

అలానే ఆహారం కూడా మీకు సహాయపడుతుంది కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మరి ఒత్తిడి ని ఎలా దూరం చేసుకోవచ్చు..? ఏ ఆహార పదార్థాలను తీసుకుంటే ఒత్తిడి దూరం అవుతుంది అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు డైట్ లో ఈ విటమిన్స్ అందేటట్టు చూసుకోవడం మంచిది.

విటమిన్ బీ6 :

విటమిన్ బీ6 తో డిప్రెషన్ తగ్గుతుంది నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. చికెన్ చేపల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

విటమిన్ డి:

మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఇది మనకి సాయం చేస్తుంది డిప్రెషన్ వంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది కనుక విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి.

విటమిన్ బి:

విటమిన్ బి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది పుట్టగొడుగులు పల్లీలలో ఇది పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ బి12 :

ఒత్తిడిని దూరం చేసి ఉపశమనాన్ని ఇది మీకు అందిస్తుంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది.

విటమిన్ బి9 :

ఫాలిక్ యాసిడ్ అని కూడా దీనిని అంటారు. డిప్రెషన్ తగ్గిస్తుంది. బీన్స్ అవకాడో వంటి వాటిలో ఇది ఉంటుంది.

విటమిన్ సి:

అలానే విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా మీరు తీసుకుంటూ ఉండండి దాంతో ఒత్తిడి దూరమవుతుంది. డిప్రెషన్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు.

మెగ్నీషియం:

మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.

విటమిన్ ఈ:

ఇది కూడా డిప్రెషన్ ని తగ్గిస్తుంది మానసిక ప్రశాంతత ని మీకు అందిస్తుంది.