ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే లివర్ సమస్యలే..!

-

చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి కొన్ని కొన్ని లక్షణాలు వల్ల మనం ఏ సమస్య కలుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఎక్కువమంది ఇబ్బంది పడే సమస్యలలో లివర్ సమస్యలు కూడా ఒకటి. అత్యంత ముఖ్యమైన అవయవం లివర్.

లివర్ మన శరీరంలో ఎన్నో పనులకి అవసరం ఈ ముఖ్యమైన అవయవానికి ఏవైనా సమస్యలు వస్తే మనం ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. లివర్ పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది అలానే ఆహారం నుండి పోషకాలను తీస్తుంది. విషపదార్థాలను తొలగిస్తుంది. ఇలా లివర్ ఎన్నో ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే ఒకవేళ కనుక ఈ లక్షణాలు ఉంటే అవి లివర్ సమస్యలు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఆ లక్షణాల గురించి చూద్దాం.

మూత్రం ముదురు రంగులో ఉండడం:

మూత్రం కనుక ముదురు రంగులో ఉంటే అది లివర్ సమస్య అని మనం చెప్పవచ్చు. లివర్ సమస్య ఉంటే మూత్రం రంగు ముదురుగా ఉంటుంది.

వికారం లేదా వాంతులు రావడం:

వికారం కలిగి వాంతులు వస్తున్నట్లయితే లివర్ సమస్య అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ సమస్య ఉంటే కూడా ఆరోగ్య నిపుణులు జాగ్రత్త పడాలని అంటున్నారు.

చర్మం దురద కలగడం:

పదేపదే చర్మానికి దురదలు వస్తున్నట్లయితే ఇది లివర్ సమస్య ఏమో చూసుకోండి.

కామెర్లు:

పచ్చకామెర్లు కూడా లివర్ సమస్యలకి లక్షణాలే. కళ్ళు మూత్రం ఎల్లో కలర్ లో ఉండడం కాలేయ కణాలను నాశనం ఫలితంగా వస్తుంది.

అలసట, వాంతిలో రక్తం ఉండడం:

ఎక్కువగా అలసటగా ఉండటం వాంతులో రక్తం కనపడడం వంటి లక్షణాలు కూడా లివర్ సమస్యలకి లక్షణాలే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సమస్యలు ఉన్నట్లయితే ఆరోగ్యనిపుణులు
కన్సల్ట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news