డయబెటిస్‌లో మూడో రకం..LADA.. టైప్‌ 2 అని ఇన్నాళ్లు భ్రమపడ్డారుగా..!

-

డయబెటిస్‌: షుగర్‌ వ్యాధికి గురించి పరిచయం అక్కర్లేదు.. ఇది ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలు ఉంటాయి అనేది అందరికీ బాగా తెలుసు. టైప్1 డయాబెటిస్ అంటే పుట్టుకతోనే వచ్చేది. దీన్నే వారసత్వంగా వచ్చే డయాబెటిస్ అని కూడా అంటారు.. ఇక టైప్2 డయాబెటిస్ పెద్దయ్యాక అనారోగ్యమైన జీవన శైలి కారణంగా వస్తుంది. కానీ ఈ రెండు కాకుండా.. ఇంకో రకం ఉంది తెలుసా..? అదే LADA. దీన్ని ‘ది లాటెంట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్’ అని కూడా పిలుస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది టైప్ 1.5 డయాబెటిస్. టైప్1 డయాబెటిస్‌లో ఇదొక వేరియంట్ అని వైద్యులు అంటున్నారు.

 

LADA పెద్దలకు మాత్రమే వస్తుంది. పిల్లల్లో కనిపించదు. చాలా నెమ్మదిగా శరీరంలో చేరి అభివృద్ధి చెందుతుంది. మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయడాన్ని ఆపివేసిన తర్వాత, ఈ టైప్ 1.5 డయాబెటిస్ ప్రారంభమవుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఈ డయాబెటిస్‌లో రోగనిర్ధారణ జరిగిన తర్వాత చాలా సంవత్సరాల వరకు ఇన్సులిన్ అవసరం ఉండదు. ప్రస్తుతం ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న వారిలో పది శాతం మంది ఈ టైప్ 1.5 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నట్టు అంచనా. కానీ వారిలో సగం మందికి ఆ విషయం కూడా తెలియదని వైద్యులు అంటున్నారు.. తమకు వచ్చింది టైప్2 డయాబెటిస్ అనుకుంటారు.

LADA సాధారణంగా 30 ఏళ్ల వయసు దాటిన వారిలోనే అభివృద్ధి చెందుతుంది. దాన్ని చాలా మంది టైప్2 డయాబెటిస్ అనుకుని, వాటి మందులే వాడతారు..అయితే కొన్ని తేలికపాటి మందులు ఈ రోగాన్ని నిర్వహించడంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రభావవంతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు నమ్ముతున్నారు. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా క్షీణిస్తుందో, అప్పుడు ఆ మందులు LADA మీద పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైపోతాయి.

లక్షణాలు
టైప్1, టైప్2 డయాబెటిస్‌లో కనిపించే లక్షణాలే ఈ LADAలో కూడా కనిపిస్తాయి. తొలిసారిగా కొన్ని ప్రారంభ లక్షణాలు ఉంటాయి.. అవేంటంటే..

మెదడు ముద్దు బారినట్టు అవుతుంది.
ఏకాగ్రత చూపించలేరు.
చర్మం పొడిగా మారి, దురద పెడుతుంది.
అలసటగా, నీరసంగా అనిపిస్తుంది.
ఎప్పుడూ ఆకలి వేస్తుంది.
తరచుగా దాహం వేస్తుంది.
మూత్ర విసర్జన పెరుగుతుంది.
దృష్టి మసకబారుతుంది

LADA రావడానికి కారణాలు ఏంటి..?

ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా శరీరంలోని యాంటీ బాడీలు పనిచేస్తాయి. అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటారు. దీనివల్ల ప్యాంక్రియాస్‌కు నష్టం జరుగుతుంది. అలా జరగడం వల్ల టైప్ 1.5 మధుమేహం వస్తుంది అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఊబకాయం వల్ల కూడా రావచ్చు.

సకాలంలో ఈ టైప్ 1.5 డయాబెటిస్‌ను గుర్తించి చికిత్స చేయాలి. లేకపోతే అది డయాబెటిక్ కీటోయాసిడోసిస్ వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధిలో ఇన్సులిన్ లేక శరీరం చక్కెరను ఉపయోగించుకోలేక పోతుంది. దీనివల్ల కొవ్వును కరిగించడం మొదలు పెడుతుంది. ఆ కొవ్వు విషపూరితంగా మారిపోవచ్చు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version