మట్టి కుండల్లో వండిన ఆహారంతో ఎన్నో లాభాలు..ఇలా చేయకపోతే మాత్రం డేంజరే..!

-

ఎంత సంపాదించినా కడుపునిండా తిననప్పుడు, కంటినిండా నిద్రపోనప్పుడు ఉపయోగం ఏం ఉంటుంది అసలు. కానీ ఎ‌వరూ ఈ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వరూ. రాళ్లు వెనకేుకుందామనే తాపత్రయం తప్ప..మన ఆరోగ్యం ఎంత వెనక్కు వెళ్తుంది..ఆహారంలో అశ్రద్ధ చేయటం ద్వారా ఎన్ని సమస్యలు వస్తున్నాయి అని ముందు ఆలోచించరు. చాలామంది..ఆ టైంకు ఏదో ఒకటి అయిందా చాలు అన్నేట్లే ఉంటున్నాం. దానికి తగ్గట్టుగా ఫాస్ట్ గా అయ్యే పరికరాలను వంటింట్లో తెచ్చుకున్నాం.

ఇందులో భాగంగానే…మట్టిపాత్రలు పోయాయి..స్టీల్ ప్లేట్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ వచ్చాయి. కానీ ఈరోజుకి కొంతమంది మట్టిపాత్రల్లోనే వండుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కేరళాలో కొబ్బరి చిప్పలతో అందమైన ఆకృతులను చేసి అమ్ముతున్నారు. ఇలా సంప్రదాయ వంటపాత్రలకు ఏదో ఓ మూల కాస్త డిమాండ్ ఉంది. అయితే ఈరోజు మనం మట్టిపాత్రలు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి, ఎలా వాడాలి, ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే…మేకప్ వేయడమే కాదు..తీయటం కూడా తెలిసి ఉండాలి. లేదంటే మేకప్ ఎంత అందాన్ని ఇస్తుందో..తీయటం రాకపోతే అన్ని సమస్యలు వస్తాయి కాబట్టి.

కొవ్వు తగ్గుతుంది..

ఈరోజుల్లో ఈ కొవ్వు సమస్యతో ఇంకా ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఏది తిన్నా కొవ్వు..అది కాస్తా బరువు పెరగటానికి దారితీస్తుంది. మట్టి కుండలు కొలెస్ట్రాల్‌ను కొంతమేర తగ్గించడంలో సహాయపడతాయి. ఎక్కువ నూనె ఉన్న ఆహారాన్ని మట్టి పాత్రలో ఉంచినప్పుడు, అది కొంతవరకు నూనెను పీల్చుకుంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో కొంతవరకు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అంతే కాకుండా మట్టి కుండలలో వండిన ఆహారానికి ప్రత్యేక వాసన, రుచి ఉంటుంది.

శరీరానికి పోషకాలు..

ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి కుండల్లోనే వంట చేయడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో చాలా రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి.. ఇవి ఆహారం సహాయంతో నేరుగా శరీరానికి చేరుతాయి. ప్రెషర్ కుక్కర్‌లో తయారు చేసిన ఆహారంలో ఈ మూలకాలు ఉండవు. కాబట్టి కుండలను మీ వంటగదిలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు.

ఉదరానికి మేలు..

ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. మట్టి కుండలలో ఆహారాన్ని ఉంచడం ద్వారా భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇతర గాజు, ఇనుము లేదా అల్యూమినియం పాత్రలు అటువంటి ప్రయోజనాలను అందించవు. మట్టిలో తయారుచేసి ఉంచిన ఆహారం ముఖ్యంగా కడుపుకు మేలు చేస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇలా క్లీన్ చేయాలి..

మట్టికుండల్లో వంట చేయడమే కాదు..దాన్ని శుభ్రం చేయటం కూడా చాలా మఖ్యం..మామూలు పాత్రల్లా వాటిని కడగకూడదు. ముఖ్యంగా సబ్బు వాడొద్దు. వాటిని 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసి ఆ తర్వాతే వాడాలి. దీనివల్ల ఆహారంలో వాడే నూనె, నీటిని పాత్రలు వెంటనే పీల్చుకోవు. పాత్రలను శుభ్రం చేయడానికి వేడి నీటిని ఉపయోగించడం మంచిదని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news