పండుగని బంధువల ఇంటికి వస్తే.. శవాలైన యువకులు..

కొన్ని కొన్నిసార్లు ఎంతో సంతోషంగా బంధువుల ఇంటికి వెళితే.. అనుకోని ఘటనంతో వారి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఎంతో ఆనందంగా బంధువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.  అలాంటి ఘటనే ఇది.. పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చి చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన హవేళిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మెదక్ మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన గంగారాం(35), చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్(18) తిమ్మాయిపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకోసం తమ బంధువులైన ఎరుకల సిద్దిరాములు ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక గిద్దకుంట చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.