మన దేశంలో చాలా మంది రెండు రకాల గుమ్మడికాయలను వాడుతుంటారు. ఒక రకం గుమ్మడి కాయలను దిష్టి తీసేందుకు వాడుతారు. లేదా ఇంటి గుమ్మాల్లో దిష్టి తగలకుండా వాటిని వేలాడదీస్తారు. అయితే బూడిద గుమ్మడికాయలనే ఇందుకోసం వాడుతుంటారు. మరో రకం సాధారణ గుమ్మడికాయలను చాలా మంది తినేందుకు ఉపయోగిస్తారు. కొందరు గుమ్మడికాయలతో హల్వా చేసుకుని తింటే కొందరు బెల్లం వేసి కూర వండుకుని తింటారు. అయితే గుమ్మడికాయలను ఎలా తిన్నా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. గుమ్మడికాయల్లో విటమిన్ ఎ, ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి2, విటమిన్ ఇ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుమ్మడికాయలను తింటే మన శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుంది.
2. గుమ్మడికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
3. గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను పోగొడుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది.
4. గుమ్మడికాయలను తరచూ తింటుంటే అధిక బరువు తగ్గుతారు.
5. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. చర్మ సమస్యలు పోతాయి.