అందం కోసం ఇలాంటివి వాడుతున్నారా? ప్రాణాలు పోవడం పక్కా..

-

అందం- ఆడవాళ్లు.. ఈ రెండు పదాలకు పెద్దగా తేడా ఉండదు.. ఆడవాళ్లు అందానికి చిహ్నలు అని కవులు ఊరికే అనలేదు.. అయితే ఇప్పుడు అంతా మేకప్ మయం అయ్యింది.. అదే ప్రాణాలను తీస్తుందని వైధ్యులు హెచ్చరిస్తున్నారు..ముఖ్యంగా లిప్స్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Woman Applying Red Lipstick

లిప్‌స్టిక్‌లో క్రోమియం, మెగ్నీషియం, లెడ్, కాడ్మియం, పెట్రో కెమికల్స్‌ను ఎక్కువగా వాడతారు. ఇన్ని కెమికల్స్ కలిసిన లిప్‌స్టిక్‌ను పెదాలకు పెడితే అవి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాడ్మియం అనే కెమికల్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అంతేకాదు కడుపులో కణితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా లెడ్ కెమికల్ వల్ల నాడీవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. వంధత్వం, హర్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. లిప్‌స్టిక్‌లో ఉండే కెమికల్స్ క్యాన్సర్ బారిన పడేసే ప్రమాదం ఉంది.

ఇందులో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలివితేటలు మందగించే అవకాశం ఉంది.. అంతేకాదు పీరియడ్స్ సరిగ్గా రావట, చర్మం మంట, దురదలు కూడా రావచ్చునట.. లిప్‌స్టిక్‌లో యూజ్ చేసే బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ , పారాబెన్స్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం చాలా వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రసాయనాల వల్ల బాడీలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందం మాట దేవుడెరుగు బ్రతికుంటే చాలు.. ఆడవాళ్లు ఆలోచించండి.. స్టిక్‌కు దూరంగా ఉండండి. అప్పుడే మీ ఆరోగ్యం బావుంటుంది. లేదంటే మీ చేతులారా మీరే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న వారవుతారు.. జాగ్రత్త సుమీ..

Read more RELATED
Recommended to you

Latest news