చాలా మంది ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటారు. అటువంటి వాళ్ళు బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే రాత్రి నిద్ర పోయేటప్పుడు వీటిని తీసుకుంటే మంచిది. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి రాత్రి నిద్ర పోయేటప్పుడు ఏమి తీసుకుంటే బరువు తగ్గొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
పీనట్ బటర్:
రాత్రిపూట పీనట్ బటర్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు పీనట్ బటర్ ని ఒక ఆపిల్ ముక్క తో పాటు తీసుకుంటే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి రాత్రి నిద్ర పోయేటప్పుడు అలా చేసి చూడండి.
ఆలివ్స్:
రాత్రి నిద్ర పోయేటప్పుడు ఆలివ్స్ ని తీసుకోవడం వల్ల కూడా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ఒక కప్పు ఆలివ్స్ లో 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇది కూడా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.
-
పిస్తా:
పిస్తా లో ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తుంది. కనుక రాత్రి నిద్రపోయేటప్పుడు వీటిని తీసుకుంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
-
క్యారెట్లు:
క్యారెట్ లో కేలరీలు తక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా రాత్రి పూట తీసుకుంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుం.ది కనుక బరువు తగ్గాలనుకొనే వారు రాత్రి పూట వీటిని తీసుకుంటే మంచిది. ఇలా వీటితో బరువు తగ్గొచ్చు.