డయబెటీస్‌కు ఎందుకు గాయాలు త్వరగా మానవు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

డయబెటీస్‌ రోగులకు అనేక ఇతర సమస్యలతో బాధపడుతుంటారు. ఏ నొప్పి ఎందుకు వస్తుందో కూడా వాళ్లు గ్రహించలేరు. డయబెటీస్‌ను బాడీలో తెచ్చుకోవడం అంటే.. పాలు పోసి ఒంట్లో పామును పెంచుకున్నట్లే.. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. రక్తంలో చక్కెర పెరుగుదల అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వైద్యులు అంటున్నారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగికి గాయం అయితే అంత త్వరగా మానదని అందరూ అంటారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది..?

 

అధిక రక్త చక్కెర స్థాయిలతో సమస్యలు ఉన్న వ్యక్తులు, వారి గాయాలు సాధారణ వ్యక్తుల కంటే పొడిగా లేదా నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అటువంటి గాయం త్వరగా నయం కావడానికి గాయం ప్రదేశంలో రక్త ప్రసరణ చాలా ముఖ్యం… కానీ డయాబెటిక్ పేషెంట్లలో గాయపడిన ప్రదేశానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ సరఫరా ఉండదు. ఎర్ర రక్త కణాలు తగినంత వేగంగా గాయానికి చేరవు. అంతే కాకుండా డయాబెటిక్ పేషెంట్లలో గాయం అయిన చోట రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఈ కారణాల వల్ల ఇతరులతో పోలిస్తే మధుమేహంతో బాధపడుతున్న రోగులలో గాయాలను తగ్గిపోవడానికి లేదా నయం చేయడానికి సమయం పడుతుంది.

డయాబెటిక్ రోగి గాయం విషయంలో ఏమి చేయాలి?

గాయం అయిన ప్రాంతాన్ని వెంటనే శుభ్రం చేయండి.చేతులు, కాళ్ళు సబ్బుతో కడగాలి.
గాయపడిన ప్రాంతాన్ని పదేపదే తాకడం మానుకోండి.
గాయం మీద యాంటీబయాటిక్ క్రీమ్ రాయండి. అవసరమైతే కట్టు కూడా వేయవచ్చు.
చక్కెర స్థాయి పెరగనివ్వవద్దు.. దానిని నియంత్రించండి.
మీ చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి.

ఇవన్నీ ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలే.. చిన్నగాయం అయినా త్వరగా మానకుండా ఇబ్బంది పెడుతుంటే.. వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఈ వర్షాకాలంలో పొరపాటున ఏదైనా గాయం అయినా చలికి ఇంకా ఇబ్బందిపడతారు. కాబట్టి డయబెటీస్‌ పేషెంట్లు ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకూ వానలో తడవకుండానే ఉండాలి.!