ఆస్తమా ఎందుకు వస్తుంది..? లక్షణాలు, ట్రీట్మెంట్ మొదలైన ముఖ్యమైన విషయాలు మీకోసం..!

-

ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల లో ఆస్తమా సమస్య కూడా ఒకటి. 360 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా సమస్యతో బాధ పడుతున్నారు. కేవలం భారతదేశంలో చూసుకున్నట్లయితే 15 వేల మంది ఆస్తమా సమస్య తో బాధ పడుతున్నారు. అయితే ఆస్తమా గురించి అవగాహన చాలా ముఖ్యం. ఎందుకంటే ఆస్తమా ఎన్నో ప్రమాదకరమైన సమస్యలుని తీసుకు వస్తుంది. కనుక పట్టించుకోకుండా వదిలేయకూడదు.

 

ఆస్తమా లక్షణాలు:

బాగా దగ్గు రావడం ముఖ్యంగా రాత్రి పూట దగ్గు ఎక్కువ రావడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
నీరసం లేదా వీక్నెస్
ఊపిరితిత్తుల సమస్యలు
ఎలర్జీ లేదా జలుబు యొక్క లక్షణాలు కనపడడం
నిద్రపోవడానికి కష్టంగా అనిపించడం

ఆస్తమా అసలు ఎందుకు వస్తుంది..?

ఇక ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది చూస్తే…. స్మోకింగ్, గాలి కాలుష్యం, పెంపుడు జంతువులు, పొగ, ఫ్లూ కారణంగా ఈ ఆస్తమా సమస్య వచ్చే అవకాశం ఉంది. కనుక వీటి వలన ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి.

ఆస్తమా కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి..?

ఈ సమస్య కనుక వచ్చిందంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఆస్తమా కోసం వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అలానే ఇన్హేలర్స్ కూడా ఉంటున్నాయి. వీటి ద్వారా తక్షణ రిలీఫ్ ని పొందొచ్చు.

ఈ సమస్య ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోపోతే ఏమవుతుంది..?

ఒకవేళ కనుక ఆస్తమా సమస్య వచ్చిందంటే అలా వదిలేయడం మంచిది కాదు. ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మాట్లాడటానికి అవ్వదు. అలానే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ట్రీట్మెంట్ ముఖ్యం.

ఏది ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే అలా వదిలేయడం మంచిది కాదు. అనారోగ్య సమస్యలకు వెంటనే చికిత్స చేయించుకోవాలి లేదంటే సమస్య మరింత ప్రమాదంగా మారిపోతాయి. అలానే ఆస్తమాకు కూడా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news