మొలకెత్తిన పెసలతో అధికబరువును ఈజీగా తగ్గించేయొచ్చు.. !

-

మొలకలు తింటే బరువు తగ్గొచ్చని చాలా మంది అనుకుంటారు. అలాగే డైలీ మార్నింగ్‌ తింటారు కూడా. మొలకల్లో పెసలతో వచ్చిన మొలకలు తింటే రిజల్ట్‌ ఇంకా బాగా ఉంటుందట. జనరల్‌గా మొలకెత్తినవి తినాలంటే.. అందరూ అలానే తినేస్తారు. అవి పచ్చిగా ఉండే సరికి బోర్‌ కొట్టేస్తుంది. పెసల మొలకలతో వెరైటీ స్నాక్‌ చేసుకుంటే.. ఇష్టంగా తింటూనే ఈజీగా బరువు తగ్గొచ్చు.

పెసర మొలకలు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించుకోవచ్చు… ఇందులో గ్లూటెన్ కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి ఉదర సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది మంచి ఆహారం. మొలకల్లో ఎక్కువ శాతం బి-కాంప్లెక్స్ విటమిన్స్, ఫోలేట్స్, థయామిన్‌లు ఉంటాయి. 100 గ్రాముల పెసర మొలకల్లో ఎక్కువ మొత్తంలో రాగి, ఇనుము, మాంగనీస్, ఫాస్పరస్, కాల్షియం, జింక్‌లు ఉంటాయి. పొటాషియం రిచ్ ఫుడ్‌లో పెసర మొలకలు కూడా ఒకటి.

పెసర మొలకలని తినడం వల్ల కలిగే బెనిఫిట్స్..

షుగర్ లెవల్స్ కంట్రోల్
కొలెస్ట్రాల్ తగ్గడం
అధికబరువు తగ్గుతారు
మలబద్ధకంతో దూరమవుతుంది. జీర్ణ సమస్యలు దూరం
ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత దూరం
జుట్టు సమస్యలు దూరం, మెరిసే చర్మం మీ సొంతమవుతాయి.

పెసర మొలకలతో ఈ విధంగా వంట చేసుకోవచ్చు..

పెసర మొలకల సలాడ్ : మొలకెత్తిన పెసలని ఉడకబెట్టండి. టమాట, ఉల్లిపాయ, దోసకాయ, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేయండి. పుదీనాని కట్ చేసి వేయండి. చివరగా కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపండి. ఇప్పుడు తయారైన సలాడ్‌ని ఆస్వాదించండి.

మొలకెత్తిన మూంగ్ చీలా : మెలకెత్తిన పెసలని మిక్సీలో పేస్ట్‌లా తయారు చేయండి.. మరీ మెత్తగా వద్దు. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మీకు ఇష్టమైన కూరగాయలను యాడ్ చేయండి. ఇప్పుడు పిండిని ఓ 30 నిమిషాలు పక్కన పెట్టండి. ఓ నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దానిపై కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఊతప్పంలా వేయండి. సిమ్‌లో 2 నుంచి 3 నిమిషాల పాటు కాస్తా ఎరుపు రంగులోకి వచ్చే వరకూ ఉంచి రెండు వైపులా కాల్చి తీసేయండి.

మొలకెత్తిన పెసలతో కట్‌లెట్స్ : గ్యాస్‌ మీద ఒక కడాయి పెట్టి.. వేరుశనగలు, ఓట్స్ వేయించండి. చల్లారిన తర్వాత వాటిని పౌడర్‌లా బాగా గ్రైండ్ చేసుకోండి. 2 ఉడకబెట్టిన బంగాళాదుంపలు తీసుకుని మెత్తగా చేసి అందులో మొలకెత్తిన పెసలు వేసి పిండిని బాగా కలపండి. ఓట్స్ పౌడర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వేస్ట్ వేసి బాగా కలపండి. ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని కట్లెట్స్‌గా చేసుకోండి..గుంటల నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని అందులో మీగడ రాసి.. ఇవి వేసి రెండు వైపులా మీగడ సాయంతో కాల్చండి అంతే టేస్టీ కట్‌లెట్స్‌ రెడీ.!

మొలకెత్తిన పెసలు ఇలా ఏదో విధంగా మీ డైట్‌లో భాగం చేసుకుంటే.. బరువు తగ్గడానికి బాగా హెల్ప్‌ అవుతుంది. అయితే పైన చెప్పిన స్నాక్‌ను చిరుతిండిలా కాదు..టిఫెన్‌ లేదా డిన్నర్‌లోనే తినండి. ఇది తిని మళ్లీ ఏదో ఒకటి తింటా అంటే.. ఎలా..?

Read more RELATED
Recommended to you

Latest news