కేజీఎఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టు ఒకటి తనకూ రావాలని అనుకున్నాడు. ఆ విధంగా సినిమా చూశాక కొన్ని విజువల్స్ కట్ చేశాడు. ఆయన వర్క్ నచ్చాక ఇంటర్వ్యూచేసి ప్రశాంత్ నీల్ తన చాప్టర్ 2 కు ఎడిటర్ గా అవకాశం ఇచ్చారు. చెప్పుకునేందుకు వెరీ సింపుల్ గానే ఉన్నా ప్రతిభ ఉంటే ఎవ్వరినైనా అవకాశాలు వరిస్తాయి అని అనేందుకు ఆ కుర్రాడే ఉదాహరణ. హీ ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్.
సినిమా నిర్మాణంలో అనేక శాఖలు భాగం అవుతాయి. ఇవన్నీ తెర వెనుక చేసిన కృషి కారణంగానే విజయానికి అవి నాంది అవుతాయి.ఆ విధంగా ఎడిటింగ్ విభాగంలో ఇప్పటిదాకా ఎన్నో మంచి విజయాలు నమోదు చేసిన వారు ఎందరో ! అయితే తొలిసారి ఓ 19 ఏళ్ల కుర్రాడు ఉజ్వల్ తన ప్రతిభను నిరూపించుకుని కేజీఎఫ్ చాప్టర్ 2 కు ఎడిటర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చకున్నాడు. త్వరలో సలార్ చిత్రానికి కూడా ఆయనే ఎడిటర్ గా పనిచేయనుండడం విశేషం. ఈ సందర్భంగా మరికొన్ని విశేషాలు.
కలలు ఎన్నో ఉంటాయి.. రంగుల కలలకు ఎన్నో అర్థాలు కూడా ఉంటాయి. కలలను సాకారం చేసుకోవడం లోనే యువత ముందుండి తమని తాము నిరూపించుకోవాలి. లేదంటే వెనుకబడిపోతారు. గురజాడ అన్న విధంగా వెనకబడితే వెనకేనోయ్ అన్న విధంగా జీవితం ఓ అర్థ రహితంగా తయారవ్వడం ఖాయం. క్రికెటర్ కావాలని కలలు కన్నాడు ఉజ్వల్ కానీ అనూహ్య రీతిలో ఎడిటర్ అయ్యాడు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఆయన స్వస్థలం అదే ! పీయూసీ ఫస్ట్ ఇయర్ తోనే చదువుకు గుడ్ బై చెప్పేసిన ఈ కుర్రాడు తన స్నేహితుడి సాయంతోనే ఇంతటి స్థాయికి చేరుకున్నానని చెబుతున్నాడు.
ఎటువంటి సినిమా నేపథ్యం లేని కుటుంంబం నుంచి వచ్చాడు. ఆయన బంధువొకరు సినిమా రంగానికి చెంది ఉన్నా అదేం పెద్ద
కేరాఫ్ కాదు. కానీ ఎడిటింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రస్ట్ తోనే ఇటుగా వచ్చానని, కన్నడ ఎడిటర్ హరీశ్ కొమ్మె దగ్గర రెండు నెలలు పనిచేశానని చెబుతున్నాడు. అటుపై తనకు ఈ అవకాశం వరించిందని,సినిమాకు సంబంధించి ఇంటర్ కట్స్ ఉంటాయని వాటికి సంబంధించి చేసిన వర్క్ విషయమై కొంచెం కష్టం అనిపించింది అని వివరిస్తూ ఉన్నాడు డైరెక్టర్ తో పాటు హీరో కూడా అందించిన
గొప్ప ప్రోత్సాహం కారణంగా సినిమాకు పడిన రెండున్నరేళ్ల కష్టం ఇవాళ తెరపై ప్రతిఫలించిందని చెబుతూ ఆనందిస్తున్నాడు.