ఆచార్య చాణక్య మన జీవితంలో చాలా సమస్యల గురించి వివరించారు. ఆచార చాణక్య చెప్పినట్లు మనం పాటిస్తే సమస్యలేమి లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించొచ్చు. చాణక్య చాలా సమస్యలకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది చక్కగా వివరించారు. ఎవరి జీవితమైనా కుటుంబం అభ్యాసం మతం స్థానం చుట్టూ తిరుగుతుందని అన్నారు. చాణక్య ఒక వ్యక్తి కుటుంబం సురక్షితంగా ఉండడానికి ఎంతో కష్టపడి పని చేస్తాడు. అయితే కొన్ని కొన్ని సార్లు పొరపాటు కూడా సమస్యల్లోకి నెట్టేస్తుంది అలాంటి పరిస్థితి తలెత్తకుండా అనుసరించాలి అని చాణక్య చెప్పారు.
డబ్బు ద్వారా మతం యోగం ద్వారా జ్ఞానాన్ని స్వీకరించొచ్చు. దయగల రాజు మంచి పాలనని అందిస్తాడు. సద్గుణ సంపన్నులైన స్త్రీలు అయితే కుటుంబాన్ని సమర్థవంతంగా రక్షించుకోగలరు అని చాణక్య అన్నారు. నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలన్న అధికారంలో కూర్చోవాలన్నా మర్యాద పూర్వక ప్రవర్తన ఉండాలి. హోదా ని చూసి ఎప్పుడు గర్వపడకూడదు అని చాణక్య చెప్పారు. అలానే విద్య కోసం నిరంతర ప్రయత్నాలు చేసేవారు దుఃఖ సమయాల్లో ఎప్పుడూ భయపడరని చాణక్య చెప్పారు.
మతాన్ని రక్షించడం చాలా ముఖ్యమని డబ్బు మతాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని చాణక్య అన్నారు. మతపరమైన పనిలో డబ్బు ఖర్చు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. అలానే డబ్బు ఆదా చెయ్యడము అవసరం. ఆపద సమయాల్లో ఎవరినీ ఆశ్రయించవలసిన అవసరం కూడా లేకుండా డబ్బు ఆదా చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. సంస్కారవంతురాలు సద్గుణ సంపన్నురాలు ఇంట్లో ఉంటే కుటుంబం వర్ధిల్లడమే కాదు తరతరాలకి మోక్షం ఉంటుందని ఆచార్య చాణక్య అన్నారు.