ఐఐటీ లేదా ఐఐఎం వంటి టాప్ కాలేజీల్లో చదవకపోయినా, చాలా మంది పారిశ్రామికవేత్తలు కంపెనీలను స్థాపించి విజయవంతగా దూసుకుపోతున్నారు. పెద్దగా ఫేమస్ కాలేజీల్లో చదవకపోయినా చిన్న కాలేజీల్లో చదివి చిన్న కంపెనీల్లో పని చేస్తూ వర్క్ నాలెడ్జి సంపాదించి అలాగే అనుభవాన్ని పొంది తరువాత సొంతంగా కంపెనీలను ప్రారంభించన వారు వందల్లో ఉన్నారు.
ACKO జనరల్ ఇన్సూరెన్స్ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన వరుణ్ దువా కూడా ఆ కోవకే చెందిన వాడు. మొదట్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆ అనుభవంతో ACKO కంపెనీని స్థాపించాడు. 8 ఏళ్ల నుంచి ఈ సంస్థను విజయవంతంగా నడుపుతూ ముందుకు సాగుతున్నాడు వరుణ్.ACKO అనేది 2016 వ సంవత్సరంలో వరుణ్ స్థాపించిన భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. బీమా ఉత్పత్తులను అందించడంలో ఇది డైరెక్ట్-టు-కన్స్యూమర్ మోడల్‌ను అనుసరిస్తుంది.
అకో ఇటీవల డిజిటల్ క్రానిక్ కేర్ మేనేజ్‌మెంట్ కంపెనీ వన్‌కేర్‌ను కూడా కొనుగోలు చేసింది. తన కార్యకలాపాల ద్వారా అకో ఆదాయం 2022లో రూ.1,334 కోట్లకి చేరగా 2023లో ఏకంగా రూ.1,759 కోట్లకు పెరగడం జరిగింది.వరుణ్ ఒక దశాబ్దం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పాటు ఫైనాన్స్ పరిశ్రమలో పనిచేశాడు. అతను టాటా గ్రూప్ యొక్క టాటా AIG లైఫ్ ఇన్సూరెన్స్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా నాలుగు సంవత్సరాలు (2003 నుంచి 2007 దాకా) పనిచేశాడు. అకో కంపెనీని స్థాపించడానికి ముందు, కవర్‌ఫాక్స్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా 3 సంవత్సరాలకు పైగా CEO గా పనిచేశాడు. 2010లో గ్లిట్టర్‌బగ్ టెక్నాలజీస్ కు సహ-స్థాపకుడిగా వ్యవహారించాడు.
వరుణ్ ఇప్పుడు తన కంపెనీ ACKO ద్వారా జనరల్ అట్లాంటిక్, యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, FPGA ఫ్యామిలీ ఫౌండేషన్ ఇంకా ఇతర వాటి నుండి ఇప్పటి వరకు ఏకంగా 460 మిలియన్ల యూఎస్ డాలర్స్ ను సంపాదించాడు. అకో తన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌ను ప్రారంభించిన రెండు సంవత్సరాలలోపే, అకో 8 లక్షలకు పైగా క్లయింట్‌లకు ఇన్సూరెన్స్ చేసింది. దీన్ని బట్టి మనం వరుణ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే పెద్ద పెద్ద కాలేజీల్లో చదవకపోయినా పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా.. ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ అనుభవంతో పాటు నాలెడ్జి పెంచుకొని పట్టుదలతో ముందడుగు వేస్తూ పెద్ద పెద్ద కంపెనీలని స్థాపించవచ్చు.