ఇతరులను తక్కువగా అంచనా వేయకూడదు

-

మనం ఒకలా ఉండాలనుకుంటాము.. కానీ ప్రపంచం మనల్ని మరోలా స్వీకరిస్తుంది. మనం ఉండాలనుకునే దానికీ, మనం చేసే పనులకీ, ప్రపంచం మనల్ని అంచనా వేసేదానికీ పొంతనే చిక్కదు. మన గుణగణాలను ఉన్నవి ఉన్నట్లు గ్రహించడం లేదని సమాజంపై అసహనానికి లోనవుతాం. ఆ గుణాలను మరింత ప్రొజెక్ట్‌ చెయ్యాలని ఆరాటపడతాం.

 

అయినా జనాల్లో చలనం ఉండదు. ఒకసారి మనల్ని తమ మనసులో ఒకలా స్థిరపరుచుకున్న తర్వాత ఆ బలీయమైన అభిప్రాయాన్ని వారి మనసు నుండి పెకిలించడానికి బ్రహ్మ దిగిరావలసిందే. ”వారు మనపై కలిగించుకున్న అభిప్రాయాలే నిజమా, వారు అనుకున్నదే మన నిజమైన వ్యక్తిత్వమా?” అని ప్రశ్నించుకుంటే ”అస్సలు వారెవరు.. మనల్ని జడ్జ్‌ చెయ్యడానికీ?” అంటూ ఎదురు తిరుగుతుంది మనసు.

వాస్తవానికి అదే కరెక్ట్‌!! ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక బలహీనతనో, బలాన్నో మనలో చూసి ”ఈ మనిషింతే” అని ముద్ర గుద్దేసుకోవడం అవివేకమే కదా. సో మనల్ని తప్పుగా అంచనా వేయడం ఎదుటి వారి తప్పు అని తెలిసినా, అవతలి వారి కన్నా మనమేమిటో మనకే పర్‌ఫెక్ట్‌గా తెలుసునని ఓ క్షణం భరోసా వచ్చినా అంతలోనే జారిపోతాం.

మనకు మనపై కన్నా సమాజం మీద గమనింపు ఎక్కువ. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకున్నా ఫర్వాలేదు గానీ ఎదుటి వారు మాత్రం మనల్ని తక్కువ చూడకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news