కొద్దిరోజుల్లో రిపబ్లిక్ డే రాబోతుంది.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అదిరిపోయే సేల్ కూడా స్టాట్ అవుతుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో అమెజాన్‌లో ఆఫర్ల వెల్లువ కురవనుంది.. ఈ నెల 19 నుంచి ఈ సేల్ ను ప్రారంభించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ 4 రోజుల పాటు.. అంటే జనవరి 22 వరకు కొనసాగనుంది. ప్రైమ్ వినియోగదారులకు 24 గంటల ముందే అంటే జనవరి 18న ఈ సేల్ స్టాట్ అవుతుంది.
గతేడాది సెప్టెంబర్ 23న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించిన అమెజాన్.. ఆ సేల్‌లో ఎలక్ట్రానిక్స్.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇయర్ ఫోన్స్ తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది అమెజాన్. అయితే.. ఆ సేల్ చాలా రోజుల పాటు కొనసాగినా డిస్కౌంట్ ఆఫర్లు మాత్రం కొన్ని రోజులే ఉన్నాయి. దీంతో మళ్లీ అమెజాన్ నుంచి భారీ సేల్ ఎప్పుడు వస్తుందా? అంటూ వినియోగదారులు తెగ ఎదురుచూశారు.
ఈ తరుణంలో గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించడంతో వినియోగదారుల్లో సందడి నెలకొంది.. దాదాపు 15 రోజుల ముందే సేల్ తేదీలను ప్రకటించడంతో షాపింగ్ చేయాల్సిన వస్తువుల జాబితాను కష్టమర్లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ఈ సేల్‌లో ఆఫర్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. మరో రెండు రోజుల తర్వాత నుంచి ఆఫర్ల వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం..అయితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో (SBI Card) కొనుగోలు చేసే వారికి మాత్రం 10 శాతం అదనపు తగ్గింపు ఉంటుందని ప్రకటించింది అమెజాన్ ప్రకటించింది..
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. వినియోగదారులు సేల్ చివరి తేదీ వరకు వేచి చూడకుండా సేల్ ప్రారంభమయ్యే రోజే తమకు కావాల్సిన వస్తువులను కొనేయడం బెటర్. ఎందుకంటే.. గత సేల్‌లో మొదటి రెండు రోజులపై ఉన్న భారీ డిస్కౌంట్లు తర్వాత కనిపించలేదు. అందుకే.. ఏమైనా కొనాలనే ఆలోచనలో ఉంటే..కాస్త ఆగి సేల్‌లో చూసుకోండి..!