వైజాగ్ వెళ్తున్నారా..? అయితే వీటిని మిస్ అవ్వద్దు..!

విశాఖపట్నం చాలా అందమైన ప్రదేశం. చాలా మంది పర్యాటకులు విశాఖపట్నం చూడడానికి వస్తూ ఉంటారు. అయితే మీరు కూడా వైజాగ్ వెళ్లాలనుకుంటున్నారా..? వైజాగ్ లో ఆనందంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా…? అయితే కచ్చితంగా ఈ ప్రదేశాలని మిస్ కాకండి. చక్కగా మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు ఈ ప్రదేశాలకు వెళ్ళండి. మరి కచ్చితంగా చూడాల్సిన ఆ ప్రదేశాల గురించి ఇప్పుడే మనం ఒక లుక్ వేసేద్దాం.

YMCA ఆర్కే బీచ్:

YMCA ఆర్కే బీచ్ దగ్గర మీరు చక్కగా సాయంత్రం స్నాక్స్ ని ఎంజాయ్ చేయొచ్చు రుచికరమైన ఆహారం మీకు ఇక్కడ దొరుకుతుంది.

అరకు వ్యాలీ కాఫీ తెన్నేటి పార్క్:

మీరు మంచి మెమరీస్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా తెన్నేటి పార్క్ లో అరకు కాఫీ ని టేస్ట్ చెయ్యండి. చాలా రుచికరంగా ఉంటుంది పైగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కచ్చితంగా మీరు మీ గ్యాంగ్ తో వెళ్తే ఇక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేయండి.

విశాఖ వ్యాలీ స్కూల్ వద్ద వ్యూ పాయింట్:

ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విశాఖపట్నం తెన్నేటి పార్క్ కి ఇది ఒక కిలో మీటర్ దూరంలో మాత్రమే ఉంది. విశాఖపట్నం కి మీరు కాస్త దూరంలో ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎన్నో ఇన్స్టగ్రామ్ రీల్స్, ఫోటోగ్రాఫ్ట్స్ వంటివి తీసుకోవచ్చు చాలా అందమైన ప్రదేశం కాబట్టి దీన్ని కూడా అసలు మిస్ అవ్వద్దు.

రిషికొండ మ్యాగీ పాయింట్:

చాలామంది ఇక్కడ క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. రుషికొండ దగ్గర ఉండే మ్యాగీ పాయింట్ దగ్గర కూడా మీరు వెళ్లి కాస్త సమయాన్ని గడపొచ్చు టేస్టీ మ్యాగీ ని మీరు ఇక్కడ ఆస్వాదించొచ్చు.

చూశారు కదా విశాఖపట్నం వెళ్లే వాళ్ళు ఎటువంటి ప్రదేశాలని మిస్ అవ్వకూడదు ఎలా ఎంజాయ్ చేయొచ్చు అని మరి చక్కగా వీటితో ఎంజాయ్ చేసి గొప్ప మెమరీస్ ని క్రియేట్ చేసుకోండి.