సెక్స్‌ తర్వాత సైలెంట్‌గా పడుకుంటున్నారా..? అబ్బాయిలకు ఇది డేంజరే

-

శృంగారం అనేది కరెక్ట్‌గా చేస్తే ఆ మజానే వేరు.. సరైన పార్టనర్‌తో గడిపే సమయం ప్రతిక్షణం మధురమే..అయితే చాలామంది శృంగారం అనేది ఆ ఒక్కపనే అన్నట్లు హడావిడిగా చేసేస్తారు. ముఖ్యంగా అబ్బాయిలు మాత్రం..కట్టెకొట్టే తెచ్చే అన్నట్లు ఉంటారు.. కానీ మీ భాగస్వామితో సెక్స్‌ లైఫ్‌ బాగుంటే.. మీ జీవితం అంతా ప్రశాంతంగా, ప్రేమతో ఉంటుంది. మరీ ఈ క్రమంలో.. సెక్స్ చేసిన తర్వాత.. శృంగారానికి ముందు ఎలా అయితే మాట్లాడుకుంటారో.. ఆఫ్టర్‌ సెక్స్‌ కూడా మీ పార్టనర్‌తో కబుర్లు చెప్పాలట.. శృంగారం(Sex) అయిపోయాక చాలా మంది మాగాళ్లు..

సైలెంట్‌గా పక్కకు తిరిగి పడుకుంటారు. కానీ మహిళలు అలా చేస్తే కాల్తుంది..చాలామందికి అమ్మాయిలకు అది నచ్చదు.. శృంగారం తర్వాత.. తమ భాగస్వామి ఎద మీద నిద్రపోవాలని కోరుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడాలని తపిస్తారు. కానీ మగవారు మాత్రం.. నిశ్శబ్ధంగా ఉంటారు. మరికొంతమందైతే.. అస్సలు దగ్గరకు రానివ్వరు. కాని ఇలా చేయడం సరికాదని నిపుణులు అంటున్నారు. అబ్బాయిలకు ఎనర్జీ లాస్‌ అయిపోయి.. మాట్లాడే ఓపిక లేక.. ఓ కునుకు తీస్తారు..కానీ అలా చేస్తే..మరీ అమ్మాయిలకు ఇష్టం ఉండదు.. సెక్స్ తర్వాత ఆ ఫీలింగ్‌ను పార్టనర్‌తో పంచుకుంటేనే.. తర్వాత.. పరిస్థితులు బాగుంటాయట.. ఎలా చేయాలో.. ముందుగా మాట్లాడుకుంటారు కదా.. ఎలా చేశారో.. తర్వాత ఎలా చేయాలో కూడా మాట్లాడుకోవడం కూడా ముఖ్యమే. సెక్స్ చేశాక కూడా మీరు ఉండే విధానాన్ని బట్టి.. మీ జీవితం బాగుంటుంది. సెక్స్ తర్వాత మాట్లాడుకోవాలని ఎక్కువగా అనుకుంటారు ఆడవాళ్లు..

మీరు అప్పుడు మాట్లాడకుండా పడుకుంటే.. మహిళలు తన భాగస్వామి ఓన్లీ సెక్స్ కోసం మాత్రమే ఉంటాడు అనే విషయాన్ని తట్టుకోలేరు.. శృంగారం జరిగాక.. మరోవైపు ముఖం తిప్పుకొని పడుకుంటే.. మీ బంధం మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది.. కాసేపు మాట్లాడితే.. ఆడవారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారట. ఇలా మాట్లాడితే.. ఒకరినొకరు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. సెక్స్ తర్వాత నిశ్శబ్ధంగా ఉంటే.. ఆడవారికి అస్సలు ఇష్టపడరు. ఏదో అసౌకర్యంగా ఫీల్ అవుతారు. శృంగారం అయిపోయాక.. ఏం మాట్లాడారు అన్నది కాదు.. ఏదో ఒకటి మాట్లాడండి. మీ ఎద మీద.. మీ భాగస్వామి తల పెట్టుకుని.. కబుర్లు చెప్పండి.

సైలెంట్‌గా ఉంటే.. ఆడవారికి నచ్చదు. వచ్చిన పని అయిపోయినట్లు ఎలా పడుకున్నాడో అనుకుంటారు..నమ్మకమైన, ఎమోషనల్ రిలేషన్ షిప్‌లో ఉండేందుకు ఇష్టపడే స్త్రీలు.., సెక్స్ తర్వాత సైలెన్స్‌ను ఇష్టపడరు. అలా ఉంటే పాపం వాళ్లు కచ్చితంగా బాధపడుతారు. ఇంటరాక్షన్ వల్ల ఇద్దరూ ఒకరికొకరు ఇంకా దగ్గర అవుతారని భావిస్తారు.

సో..ఇందుమూలంగా అబ్బాయిలందరికీ చేప్పేదేంటంటే..సెక్స్‌ తర్వాత సైలెంట్‌గా పడుకోకుండా..పార్టనర్‌తో కాసేపు కబుర్లు చెప్పండి.. రిజల్ట్‌ మీకే తెలుస్తుంది..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version