యాపిల్స్ అంటే ఇష్టపడని వాళ్లు అంటూ ఉండరూ.. ఏ సీజన్‌లో అయినా మనకు ఆపిల్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. మంచి పోషకాలు అందుతాయి.. మీకు ఆపిల్స్ అండే.. రెడ్, గ్రీన్, వైట్, పసుపు కలర్స్‌లో ఉండేవి మనకు తెలుసు. బ్లాక్ కలర్‌లో యాపిల్స్‌ను ఎప్పుడైనా చూశారా..? ఇది చాలా అరుదైనది. ఎక్కడపడితే అక్కడ దొరకదు. ఆపిల్ జాతుల్లో అన్నిటికంటే ఖరీదైన ఆపిల్ కూడా ఇదే. దీన్ని బ్లాక్ డైమండ్ ఆపిల్ అని పిలుస్తారు. అలాగే అబ్సిడియన్ ఆపిల్ అని కూడా అంటారు.
ఎక్కడ దొరుకుతుంది?
టిబేట్ పర్వతాల శ్రేణుల్లో ప్రత్యేకంగా ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్స్‌ను సాగు చేస్తారు. ఇది మెరిసే చర్మంతో ఉంటుంది. కొన్ని ముదురు ఊదా రంగుతో కూడా ఉంటాయి. లోపల మాత్రం తెలుపు రంగులోనే గుజ్జు ఉంటుంది. మెరిసే ఆ నలుపు రంగు వల్లే దీనిని బ్లాక్ డైమండ్ అంటారు.
ఆపిల్స్ లాగే ఈ పండులో కూడా డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు సహకరిస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో విటమిన్ సీ అయితే అధికంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తిని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్లన్నీ ఇందులో ఉంటాయి. ఇవి ఎందుకు ఖరీదైనవి అంటే.. వీటిని సాగు చేయడం చాలా కష్టం. సాగు ప్రక్రియలో కచ్చితమైన ఉష్ణోగ్రత, కాంతి నియంత్రణ అవసరం. అందుకే ప్రతి వాతావరణంలో ఇవి పండవు. అయితే సరైన వాతావరణాన్ని మేం ఏర్పాటు చేసుకుంటాం..పండించుకుంటాం అంటే. .మనకు ఆన్‌లైన్ మార్కెట్‌లో వీటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. తీసుకోవచ్చు.
ఆపిల్ పండు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. అప్పటికే పేరుకున్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. చర్మసంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఆపిల్ ముందుంటుంది. తలనొప్పిని తగ్గించడంలో ఈ పండు మేలు చేస్తుంది. ఆస్తమా, అనీమియా, క్షయ, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడే వారు ఆపిల్ పండు తింటే నమయవుతాయి. చర్మంపై ఉన్న మచ్చలను కూడా ఆపిల్ పండులోని పోషకాలు తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అందుకే పండ్లు కొనేప్పడు యాపిల్‌ను కూడా కచ్చితంగా తీసుకోండి.