బట్టల మీద అంటుకున్న చ్వియింగమ్‌ ఇలా ఈజీగా తీసేయొచ్చు.. ఇంకా ఎన్నో హాక్స్‌ మీ కోసం..!

-

కొంతమందికి ఒక్కసారి తుమ్ములు రావడం మొదలైతే అస్సలు ఆగవు..వస్తూనే ఉంటాయి. తమ్మి తుమ్మి మనతో పాటు పక్కన వాళ్లకు కూడా ఇబ్బంది..ఇంకా పండ్లలో అన్నింటి కంటే చీప్‌గా ఉండేవి అరటిపండ్లు..ఇప్పుడు ఆ పండ్ల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇవి రెండు మూడు రోజులు ఉండే సరికి నల్లగా అయిపోతాయి. ఇవి పాడవకుండా ఉండాలంటే ఏదైనా చిట్కా ఉందా.? ఇలాంటి కొన్ని రియల్‌ లైఫ్‌లో ఫేస్‌ చేసే చిన్న చిన్న పనులకు చిలిపి చిట్కాలు ఈరోజు మీకోసం..!

తుమ్ములు తగ్గాలంటే..మీ నాలుకను పై పళ్ల వెనకకు మడిచి పెట్టండి. తుమ్ములు తగ్గిపోతాయి. కావాలలంటే ఈ సారి తుమ్ములు వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి.

ఒక్కోసారి పొట్టపగలిలేలా నవ్వొస్తుంది. మనం ఎంత కంట్రోల్‌ చేసుకుందాం అనుకున్నా అస్సలు నవ్వు ఆగదు.. నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి, కడుపు నొప్పి వస్తుంది. పక్కన వాళ్లు చూస్తున్నారన్నా..మనకు ఎందుకో అస్సలు నవ్వు కంట్రోల్‌ కాదు.. అలాంటప్పుడు మీకు మీరు గిచ్చుకోండి. అలా చేస్తే నవ్వడం ఆపేస్తారు.

అరటిపండ్లు చూడ్డానికి నీట్‌గా ఉంటేనే తినాలనిపిస్తుంది. మూడు నాలుగు రోజులు అయినా అరటిపండ్లు తాజాగా ఉండాలంటే.. పండ్లు తెచ్చినప్పుడే వాటి ముందు భాగం..కాడలు ఉంటాయి కదా.. వాటిని ప్లాస్టిక్‌ కవర్లో చుట్టిపెట్టండి అలా చేస్తే..అరటిపండ్లు తాజాగా ఉంటాయి.

ఉల్లిపాయ లేకుండా ఏ వంట చేయరాదు. కొన్ని వంటలకు అయితే విపరీతంగా ఉల్లిపాయలు కావాల్సి వస్తుంది. అన్ని కోయాలంటే..కళ్లలో నీళ్లు మాములుగా రావు. ఉల్లిపాయలు కోసేప్పుడు నీళ్లు రావొద్దని చాలామంది కళ్లద్దాలు పెట్టుకుని కోస్తారు. ఇంకొంత మంది కట్‌ చేసేముందు వాటిని నీళ్లలో వేసి అప్పుడు కట్ చేస్తారు. ఇలా నీళ్లలో వేయడం వల్ల కూర త్వరగా పాడవుతుంది. ఇవేవి లేకుండా సింపుల్‌గా ఉల్లిపాయలు కట్‌ చేసేముంద చ్వియింగమ్‌ నములుతూ కట్‌ చేయండి చాలు.. అస్సలు నీళ్లు రావు.

ఇంట్లో అద్దాలు క్లీన్‌ చేయడానికి ఏవేవో వాడేబదులు..స్పైట్‌తో క్లీన్‌ చేసి చూడండి. చాలా నీట్‌గా క్లీన్‌ అవుతాయి.

బట్టల మీద పొరపాటున చ్వియింగమ్‌ అతుక్కుంటే వాటిని తీయడం చాలా కష్టం.. అలా అతుక్కుంటే.. మీరు ఆ బట్టలను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక గంట ఉంచండి. ఆ తరువాత తీస్తే.. చ్వియింగమ్‌ ఈజీగా వచ్చేస్తుంది.

సో..ఇది.. వీటిల్లో మీకు ఉపయోగపడేవి ఉండే ఉంటాయి కదా..! ఈ సారి అవసరం వచ్చినప్పుడు ట్రే చేసి చూడండి.!

Read more RELATED
Recommended to you

Latest news