వ్యాక్సిన్ జాత‌ర‌కు ఏడాది? ఫిదా హోగ‌యా!

-

మందుల‌న్నీ మంచే  చేస్తాయి అని చెప్ప‌డం త‌ప్పు కానీ కొన్నే అనూహ్య రీతిలో మంచి ప‌రిణామాల‌కు ఆన‌వాలుగా నిలుస్తాయి. ఆ క్ర‌మంలో క‌రోనా వైద్య రంగానికి పెను స‌వాళ్లు విసిరింది.అయినా కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వ‌చ్చిన వివిధ మార్పులు అన్నీ క‌రోనాను అర్థం చేసుకునేందుకు, దీనిని క‌ట్ట‌డి చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఓ మోస్త‌రు నుంచి ఓ మంచి స్థాయి వ‌ర‌కూ
ఫ‌లితాలు ఇచ్చాయి.కొన్నిసార్లు చిన్న చిన్న త‌ప్పిదాలు ఉన్నా కూడా వ్యాక్సినేష‌న్ ప్రాసెస్ మాత్రం భార‌త్ లో చాలా బాగా జ‌రిగింది. ముందుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్ర‌భుత్వాలు చాలా బాగా ప‌నిచేశాయి. అవి చేసిన విధంగా మిగ‌తా రాష్ట్రాలు కూడా చేయలేక‌పోయాయి అని చెప్ప‌డం కూడా అతిశ‌యం కాదు. వ్యాక్సినేష‌న్ ప్రాసెస్ జ‌రిగి ఏడాది పూర్త‌వ్వ‌డం, అందుకు ఇరు రాష్ట్రాల నాయ‌క‌త్వాలూ చాలా బాగాక్షేత్ర స్థాయిలో ఫ‌లితాలు అందుకోవ‌డం నిజంగానే శుభ పరిణామం. ఇక్క‌డ ఇరు రాష్ట్రాల కృషి ఫలించింది అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఆ విధంగా ఫిదా హోగ‌యా!

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్
Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

ప్ర‌పంచాన్ని శాసిస్తున్న కోవిడ్ – 19 కు ఓ మందు కావాలి. నివారణ‌కు మందు కావాలి అనుకున్నాం కానీ అది అనుకున్నంత సులువు అయితే కాదు.యావ‌త్ ప్ర‌పంచం ఆమోదించే స్థాయిలో ఒక మందు కావాలి.వ్యాక్సిన్ రూపంలో అది మాన‌వాళి అంత‌టినీ ప్ర‌భావితం చేయాలి.కో వ్యాగ్జిన్ (మ‌న భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన) మాత్రం బాగానే జ‌నంలోకి పోయింది.సైడ్ ఎఫెక్ట్స్ త‌క్కువ‌గా ఉన్న కో వ్యాక్జిన్ ప్ర‌పంచం ఆమోదాన్ని పొందింది.మ‌న హైద్రాబాద్ లోనూ భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన ఈ వ్యాగ్జిన్ కు ఇప్పుడు దేశం నుంచే విదేశం నుంచి కూడా మంచి పోటీ ఉంది.మంచి డిమాండ్ కూడా ఉంది. దీని త‌రువాత నాలుగైదు ర‌కాల వ్యాక్సిన్లు వ‌చ్చినా అవేవీ కోవ్యాగ్జిన్ ముందు నిల‌దొక్కుకోలేకపోయాయి.

కో వ్యాగ్జిన్ తో పాటు సీర‌మ్ కంపెనీ మార్కెట్లోకి విడుద‌ల చేసిన కొవిషీల్డ్, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ విడుద‌ల చేసిన మ‌రో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కూడా భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన మందుకు వ‌చ్చిన పేరు దేనికీ రాలేదు. అదేవిధంగా ర‌ష్యా విడుద‌ల చేసిన స్పూత్నివ్ – వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోనే ఉన్నా భార‌త్ బ‌యోటెక్ తో అది పోటీ ప‌డ‌లేక‌పోయింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్లో అనూహ్య రీతిలో దూసుకుపోయింది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వ్యాక్సిన్ ప్ర‌క్రియ మొద‌ల‌యి భార‌త్ లాంటి పెద్ద దేశంలో విజ‌య‌వంతంగా ఏడాది పూర్త‌వ్వ‌డం ఓ శుభ‌ప‌రిణామం. ఓ విధంగా ఇది మ‌న ప్ర‌భుత్వాలు సాధించిన ఘ‌న‌త‌కు సంకేతం ఈ ఘ‌ట‌న.

Read more RELATED
Recommended to you

Latest news